Viral Video: 1940లో జిమ్ లు ఎలా ఉండేవో తెలుసా.. మహిళలు శరీరం ఫిట్ గా ఉంచుకోవడానికి ఏ యంత్రాలను ఉపయోగించేవారంటే..
70-80 ఏళ్ల క్రితం జిమ్ ఎలా చేసేవారో తెలుసా.. అప్పట్లో తమ ఊబకాయాన్ని ఎలా తగ్గించుకునే వారో తెలిపే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video: గతం ఎప్పుడూ ఘనం అన్నాడో సినీ కవి. అవును మన పూర్వీకులు.. మన కంటే కొన్ని ముందు తరలవారు ఏ విధంగా జీవించారో తెలుసుకోవాలని చాలామంది కోరుకుంటారు. ముఖ్యంగా పూర్వకాలంలో మనుషులు ఎలా ఆరోగ్యంగా జీవించేవారు.. ఏమి తినేవారు.. ఏమి తాగేవారో.. వంటివి ఆలోచిస్తారు.. ఎలా జీవించారో తెలుసుకోవాలనే ఉత్సుకత అందరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా నేటి మనిషి ఆరోగ్యంగా ఉండడం కోసం జిమ్, యోగ వంటివాటిని ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇప్పుడంటే కసరత్తులు కోసం రకరకాల పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.. మరి పూర్వ కాలంలో ఇలాంటి యంత్రాలు ఉండవు కదా.. మరి అప్పుడు జిమ్ ఎలా చేసేవారు అని ఆలోచిస్తారు. ముఖ్యంగా క్రీడాకారులు, సినీ నటీనటులు ఇప్పుడు జిమ్‌లో చాలా రకాల మెషిన్‌లతో శరీరాన్ని ఫిట్ గా ఉంచుకునేలా చూసుకుంటున్నారు. అందుకోసం చాలా కష్టపడతారు. వాటి సహాయంతో శరీరాన్ని సన్నగా, ఫిట్ గా ఉండేలా చూసుకుంటారు. అయితే 70-80 ఏళ్ల క్రితం జిమ్ ఎలా చేసేవారో తెలుసా.. అప్పట్లో తమ ఊబకాయాన్ని ఎలా తగ్గించుకునే వారో తెలిపే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1940 లలో మహిళలు జిమ్‌లో శరీరాన్ని ఏ విధంగా ఫిట్ గా ఉంచుకునేవారో ఈ వీడియో ద్వారా తెలుస్తుంది.
వీడియోలో జిమ్ లో కొన్ని మెషీన్లు ఉన్నాయి. ఆ మెషీన్లను ఉపయోగిస్తున్న మహిళలు కనిపిస్తారు. నిజానికి ఇది 1940ల నాటి జిమ్, ఇక్కడ మహిళలు వ్యాయామం చేస్తూ తమ శరీరానికి ఫిట్ గా తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవి చాలా ప్రత్యేకమైన యంత్రాలు.. వీటి లోపల మహిళలు మాత్రమే నిలబడాలి. ఈ పరికరాలు మహిళ పాదాల నుండి వారి కడుపు వరకు కదులుతూ మర్దనా చేస్తూ ఉంటాయి. అయితే ఇంత ఆధునిక విజ్ఞానం, శాస్త్ర సాంకేతిక అందుబాటులోకి లేని అప్పట్లో కూడా శారీరం ఫిట్ గా ఉంచుకోవడని.. తమ ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి ఆటోమేటిక్ మెషీన్లు వాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. రకరకాల మెషీన్లతో మహిళలు జిమ్ చేస్తున్న తీరు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అప్పటి వీడియో ఇప్పుడు చూడడం చాలా అరుదైన విషయం.. కనుక ఈ పాత వీడియో మళ్ళీ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
వైరల్ వీడియో
Woman’s gym in the 1940s. pic.twitter.com/ntjzzox6yv
— Lost in history (@lostinhist0ry) July 25, 2022
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో లాస్ట్ ఇన్ హిస్టరీ అనే ID పేరుతో షేర్ చేయబడింది . ఇది 1940 నాటి మహిళల జిమ్ అని క్యాప్షన్‌లో చెప్పబడింది. ఈ 46 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 1 లక్ష కంటే ఎక్కువ సార్లు వీక్షించారు. వందలాది మంది ప్రజలు వీడియోను లైక్ చేసారు. రకరకాల కామెంట్స్ చేస్తూ.. అప్పట్లో కూడా ఉన్న మనషి మేథస్సుకు ఫిదా అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .