AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: స్కూల్ లో ఎక్కువ హోమ్ వర్క్ ఇస్తున్నారు.. ఆడుకోలేకపోతున్న.. ప్రధానికి కంప్లైంట్ చేస్తోన్న చిన్నారి.. వీడియో వైరల్

వీడియోలో చిన్నారి మొదట తన పేరు, తన పాఠశాల పేరు చెప్పింది. తర్వాత ప్రధానికి తన సమస్యను వివరిస్తూ.. ఫిర్యాదు చేయడం ప్రారంభించింది

Viral Video: స్కూల్ లో ఎక్కువ హోమ్ వర్క్ ఇస్తున్నారు.. ఆడుకోలేకపోతున్న.. ప్రధానికి కంప్లైంట్ చేస్తోన్న చిన్నారి.. వీడియో వైరల్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jul 24, 2022 | 12:33 PM

Viral Video: పిల్లలు భగవంతుని స్వరూపం అని అంటారు. పిల్లల మనసు కల్మషం ఉండదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పిల్లలకు సంబంధించిన ఏ వీడియో వచ్చినా నెటిజన్లను ఆకట్టుకుంటుంది. పిల్లల అమాయకత్వం వారిని ఆకట్టుకుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో  ఓ అమ్మాయి వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చిన్నారి తనకు పాఠశాలలో ఇచ్చే హోంవర్క్ గురించి ఆందోళన చెందుతోంది. అంతేకాదు ఏకంగా తన హోమ్ వర్క్ గురించి దేశ ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఎక్కడిది అన్న సమాచారం లేదు కానీ.. ఆ అమ్మాయి తన సమస్యలను చెప్పుకుంటున్న తీరు చూస్తుంటే..  స్కూల్‌లో ఇస్తున్న హోం వర్క్‌తో చాలా బాధపడినట్లు తెలుస్తోంది. హోం వర్క్ కారణంగా ఆటలను కూడా ఆడలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఇక్కడ వీడియో చూడండి:

ఇవి కూడా చదవండి

వీడియోలో చిన్నారి మొదట తన పేరు, తన పాఠశాల పేరు చెప్పింది. తర్వాత ప్రధానికి తన సమస్యను వివరిస్తూ.. ఫిర్యాదు చేయడం ప్రారంభించింది. స్కూల్ లో తనకు చాలా హోమ్ వర్క్ ఇస్తున్నారని.. ఆడుకునే సమయం ఉండడం లేదని చెప్పింది. మేము ఎంత హోమ్ వర్క్ చేస్తున్నామో కూడా స్కూల్ వాళ్లకు తెలియదని చెప్పింది. అంతేకాదు .. స్కూల్ హోమ్‌వర్క్‌తో అమ్మ కూడా ఇబ్బంది పడుతోంది. కనుక మాకు ఎక్కువ హోమ్ వర్క్ ఇవ్వద్దని.. మేము చిన్న పిల్లలం కనుక స్కూల్ వారు అది గుర్తుంచుకుని మాకు హోమ్ వర్క్ తక్కువగా ఇవ్వాలని సూచిస్తోంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ప్రజలు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. వీడియోపై వ్యాఖ్యానిస్తూ.. ప్రధాని మోడీ గారు మీరు బాలిక ఫిర్యాదుపై శ్రద్ధ వహించాలి’ అని, ‘నిజంగా పిల్లలు చిన్న వయస్సులో చాలా  హోమ్ వర్క్ చేస్తున్నారు.. అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అలాంటి పరిస్థితి ఏ ఆర్టిస్టుకు రాకూడదు.. ఈ నటి కష్టాలు తెలిస్తే..
అలాంటి పరిస్థితి ఏ ఆర్టిస్టుకు రాకూడదు.. ఈ నటి కష్టాలు తెలిస్తే..
ఆ బౌలరంటే ముంబై ఇండియన్స్‌కు భయం: రాయుడు
ఆ బౌలరంటే ముంబై ఇండియన్స్‌కు భయం: రాయుడు
తండ్రి షాపులో రూ.2 లక్షలు చోరీ.. ఐఫోన్‌ కొన్న ఏడో తరగతి పిల్లోడు!
తండ్రి షాపులో రూ.2 లక్షలు చోరీ.. ఐఫోన్‌ కొన్న ఏడో తరగతి పిల్లోడు!
టాలీవుడ్ షూటింగ్స్‎తో కళ కళ.. హీరోలు అందరూ సెట్స్‎లోనే..
టాలీవుడ్ షూటింగ్స్‎తో కళ కళ.. హీరోలు అందరూ సెట్స్‎లోనే..
5 సినిమాలు చేస్తే నాలుగు సూపర్ హిట్టే..
5 సినిమాలు చేస్తే నాలుగు సూపర్ హిట్టే..
అజహరుద్దీన్ పేరు తొలగించొద్దు.. హెచ్‌సీఏకు షాకిచ్చిన హైకోర్ట్
అజహరుద్దీన్ పేరు తొలగించొద్దు.. హెచ్‌సీఏకు షాకిచ్చిన హైకోర్ట్
కొత్త సమస్యతో బాధపడుతోన్న పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్
కొత్త సమస్యతో బాధపడుతోన్న పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్
చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. తెరుచుకున్న యమునోత్రి ఆలయ ద్వారాలు..
చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. తెరుచుకున్న యమునోత్రి ఆలయ ద్వారాలు..
తెలంగాణ టెన్త్ 2025 ఫలితాలు మరింత ఆలస్యం! రిజల్ట్స్ ఎన్నింటికంటే
తెలంగాణ టెన్త్ 2025 ఫలితాలు మరింత ఆలస్యం! రిజల్ట్స్ ఎన్నింటికంటే
ఢిల్లీ, కోల్‌కతా టీంలకు షాకింగ్ న్యూస్.. గాయాలతో దూరమైన ఇద్దరు
ఢిల్లీ, కోల్‌కతా టీంలకు షాకింగ్ న్యూస్.. గాయాలతో దూరమైన ఇద్దరు