Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: డిస్నీ వరల్డ్‌లో 2 కుటుంబాల మధ్య భారీ ఘర్షణ.. నెట్టింట్లో షాకింగ్ వీడియో వైరల్

ఇరుకుటుంబాల గొడవ  గందరగోళం ఉందని వీడియో చూస్తుంటే తెలుస్తోంది. పిల్లలు ఏడుస్తున్నారు. పెద్దలు అరుస్తూ.. ఒకరితో ఒకరు గొడవపడుతున్నారు.

Viral Video: డిస్నీ వరల్డ్‌లో 2 కుటుంబాల మధ్య భారీ ఘర్షణ.. నెట్టింట్లో షాకింగ్ వీడియో వైరల్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jul 23, 2022 | 1:45 PM

Viral Video: కొంతమంది ఇరుగుపొరుగువారు సొంత కుటుంబ సభ్యుల్లా కలిసి మెలసి ఉంటే.. మరికొందరు.. చిన్న చిన్న విషయాలకు కూడా ఓ రేంజ్ లో కొట్టుకుంటారు. తాజాగా ఓ రెండు కుటుంబ మధ్య జరిగిన ఘర్షణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన అమెరికా  ఫ్లోరిడాలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓర్లాండోలోని డిస్నీ వరల్డ్‌లో రెండు కుటుంబాల మధ్య భారీ ఘర్షణ జరిగింది. ఈ షాకింగ్ ఫైట్‌ను వీక్షకులు కెమెరాలో బంధించగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టిక్‌టాక్ నుండి వీడియో డిలీట్ చేశారు.. అయినప్పటికీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయిన ట్విట్టర్ , ఫేస్‌బుక్‌లో మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోలో ఓ పది మంది వ్యక్తులు ఒకరిపై ఒకరు అరుస్తూ తిట్టుకుంటూ భౌతికంగా దాడులు చేసుకున్నారు. మొత్తానికి ఇరుకుటుంబాల గొడవ  గందరగోళం ఉందని వీడియో చూస్తుంటే తెలుస్తోంది. పిల్లలు ఏడుస్తున్నారు. పెద్దలు అరుస్తూ.. ఒకరితో ఒకరు గొడవపడుతున్నారు. ఒకరు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళుతుండగా, మరో వ్యక్తి టీ-షర్టు పూర్తిగా చిరిగిపోయింది.

ఇవి కూడా చదవండి

రెండు కుటుంబాల సభ్యులు  గుంపులుగా ఏర్పడి.. ఓ రేంజ్ లో కొట్టుకున్నారు. ఈ వివాదంలో గాయపడిన ఓ వ్యక్తిని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

నివేదికల ప్రకారం.. ఓర్లాండోలోని మ్యాజిక్ కింగ్‌డమ్ థీమ్ పార్క్ వద్ద గొడవ ప్రారంభమైంది. మిక్కీస్ ఫిల్‌హార్ మ్యాజిక్ థియేటర్‌లో ప్రదర్శన కోసం రెండు కుటుంబాలు క్యూలో నిలబడి ఉన్నాయి. ఒక కుటుంబ సభ్యుడు ఫోన్ మాట్లాడడానికి క్యూ విడిచి పెట్టి వెళ్ళాడు.. మళ్ళీ కొంచెం సేపటి తర్వాత తిరిగి లైన్ లో నిల్చుకోవడానికి ప్రయత్నీమ్చినా సమయంలో మరొక కుటుంబం ఆమెను క్యూలోకి రాకుండా అడ్డుకున్నారు.  దీంతో రెండు కుటుంబాలు థియేటర్ ఎగ్జిట్ ప్రాంతంలో ఒకరికొకరు ఎదురుపడ్డారు. అమ్మాయి కుటుంబ సభ్యుడు మరో కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగాడు. తన చెల్లిని క్యూలోకి రానివ్వకుండా నెట్టడం సరికాదంటూ వ్యాఖ్యానించాడు.  అలా మొదలైన గొడవ.. చివరికి ఒకరినొకరు దూషించుకోవడం.. కొట్టుకుని బట్టలు చింపుకోవడం వరకూ చేరుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్లో చక్కర్లు కొడుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తలను చదవడానికి క్లిక్ చేయండి

రోజురోజుకు పెరిగిపోతున్న కింగ్‌డమ్‌ హైప్‌.. కారణం అదేనా ??
రోజురోజుకు పెరిగిపోతున్న కింగ్‌డమ్‌ హైప్‌.. కారణం అదేనా ??
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫలితాలు ఎప్పుడంటే..
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫలితాలు ఎప్పుడంటే..
ఆదాయపు పన్ను శాఖ ఇప్పుడు మీ వాట్సాప్ చాట్‌లకు యాక్సెస్ పొందుతుందా
ఆదాయపు పన్ను శాఖ ఇప్పుడు మీ వాట్సాప్ చాట్‌లకు యాక్సెస్ పొందుతుందా
సడన్‌గా ట్రెండ్‌లో గేమ్‌ ఛేంజర్‌.. రీజన్‌ ఇదే!
సడన్‌గా ట్రెండ్‌లో గేమ్‌ ఛేంజర్‌.. రీజన్‌ ఇదే!
రాములోకి కల్యాణంలో పానకం వడపప్పు నైవేద్యం.. రెసిపీ, ప్రయోజనాలు
రాములోకి కల్యాణంలో పానకం వడపప్పు నైవేద్యం.. రెసిపీ, ప్రయోజనాలు
'మళ్లీ అమ్మను కాబోతున్నా'.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
'మళ్లీ అమ్మను కాబోతున్నా'.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
ఆంధ్రాలో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇది
ఆంధ్రాలో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇది
కేకేఆర్‌తో పోరంటే జడుసుకుంటోన్న హైదరాబాద్..
కేకేఆర్‌తో పోరంటే జడుసుకుంటోన్న హైదరాబాద్..
సముద్రంలో అనుమానాస్పద నౌక.. నేవీ అధికారులు వెళ్లి చెక్ చేయగా..
సముద్రంలో అనుమానాస్పద నౌక.. నేవీ అధికారులు వెళ్లి చెక్ చేయగా..
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్ గుప్తా.. ఆమె ఎవరో తెలుసా?
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్ గుప్తా.. ఆమె ఎవరో తెలుసా?