Auto vala dance: వరద ముంపులో ఆటోవాలా ఆనందం... ఏం చేశాడో చూడండి..

Auto vala dance: వరద ముంపులో ఆటోవాలా ఆనందం… ఏం చేశాడో చూడండి..

Anil kumar poka

|

Updated on: Jul 27, 2022 | 8:29 AM

గుజరాత్‌లోని భరూచ్‌కి చెందిన ఓ ఆటో డ్రైవర్ భారీ వర్షాల కారణంగా నీటిలో మునిగిపోయిన రహదారి మధ్యలో సంతోషంగా నృత్యం చేశాడు.


గుజరాత్‌లోని భరూచ్‌కి చెందిన ఓ ఆటో డ్రైవర్ భారీ వర్షాల కారణంగా నీటిలో మునిగిపోయిన రహదారి మధ్యలో సంతోషంగా నృత్యం చేశాడు. చుట్టూ ఎవరు ఉన్నారు? తానెక్కడున్నాను? అనే సంశయమే లేకుండా.. వర్షాన్ని, వరద నీటిని తెగ ఎంజాయ్ చేశాడు. చిన్నపిల్లాడిలా మారిపోయి.. సరదాగా డ్యాన్స్ చేశాడు. వాస్తవానికి ఆ డ్యాన్స్‌కు ముందు.. అతని ఆటో గుంతలో కూరుకుపోయింది. దాంతో ఆటోను బయటకు లాగేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఫలితం లేకపోవడం.. ఆటోను రోడ్డుపైనే వదిలేసి, వర్షపు నీటిలో డ్యాన్స్ చేశాడు. కాగా, ఈ డ్యాన్స్‌కు బ్యాక్ డ్రాప్‌గా తేరీ పాయల్ బాజీ జహాన్ పాట వస్తోంది. ఈ ఫన్నీ వీడియోను హాస్యనటుడు సునీల్‌ గ్రోవర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కాగా, ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మిలియన్ మందికి పైగా ఈ వీడియోను వీక్షించగా.. లక్షల్లో లైక్‌ చేసారు. ఆటో డ్రైవర్ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కోట్లు పెట్టిన ఇలాంటి సంతోషం లభించదని మరికొందరు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..

Bus Shelter – Buffalo: బస్‌ షెల్టర్‌ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..

Published on: Jul 27, 2022 08:29 AM