Bus Shelter – Buffalo: బస్‌ షెల్టర్‌ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..

ప్రజలకు కావాల్సిన అవసరాలను, సదుపాయాలను కల్పించడం.. ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల బాధ్యత. అయితే వారు ఎన్నికైన తర్వాత తమ బాధ్యతను విస్మరిస్తే..

Bus Shelter - Buffalo: బస్‌ షెల్టర్‌ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..

|

Updated on: Jul 26, 2022 | 9:15 AM


ప్రజలకు కావాల్సిన అవసరాలను, సదుపాయాలను కల్పించడం.. ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల బాధ్యత. అయితే వారు ఎన్నికైన తర్వాత తమ బాధ్యతను విస్మరిస్తే.. ప్రజలే వారికి తగిన విధంగా గుణపాఠం చెబుతారు అని తెలియజేసే.. ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కర్నాటక రాష్ట్రం గడగ్‌లోని బాలెహోసూర్‌ గ్రామస్తులు తమ గ్రామంలో బస్‌స్టాండ్‌ను పునరుద్ధరించమని అనేకసార్లు ప్రజా ప్రతినిధులు, అధికారులకు మొరపెట్టుకున్నారు. అయితే అధికారులు పట్టించుకోకపోవడంతో విసిగిపోయిన గ్రామస్తులే స్వయంగా తాత్కాలిక బస్‌ షెల్టర్‌ను నిర్మించుకున్నారు. అంతేకాదు ఆ షెల్టర్ ప్రారంభోత్సవానికి ఏ ప్రజాప్రతినిధిలో కాదు.. ఓక గేదెను తీసుకొచ్చి షెల్టర్‌ ప్రారంభించారు. బలేహోసూర్‌ గ్రామంలో 40 ఏళ్ల క్రితం నిర్మించిన బస్‌ షెల్టర్‌ కూలిపోయి, డంపింగ్‌యార్డ్‌గా మారింది. దీంతో ప్రయాణికులు మండుటెండల్లో, భారీ వర్షంలో నిల్చుని బస్సుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామప్ప లమాని, ఎంపి శివకుమార్‌ లకు బస్ షెల్టర్ ను పునర్మించమని చాలా సార్లు తాము వినతి పత్రం ఇచ్చామని రైతు నాయకుడు లోకేష్‌ జలవాడగి చెప్పారు. “తమ గ్రామంలో 5,000 జనాభా ఉన్నారని, ప్రతిరోజు వందల మంది విద్యార్థులు గ్రామం నుండి చుట్టుపక్కల పట్టణాలకు ప్రయాణిస్తుంటారని గ్రామస్థులు చెప్పారు. ప్రభుత్వ ఉదాసీనతపై వినూత్న రీతిలో నిరసన తెలపాలని తాము నిర్ణయించుకున్నామని తెలిపారు. అందుకే కొబ్బరి ఆకులతో తాత్కాలికంగా షెల్టర్ పైకప్పును నిర్మించి గేదెను ముఖ్య అతిథిగా తీసుకువచ్చి రిబ్బన్‌ కటింగ్‌ చేయించామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు, శాసనసభ్యులు త్వరలో బస్ షెల్టర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Follow us