Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

విరాట పర్వంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఇందులో వెన్నెల పాత్రలో ఆమె ఒదిగిపోయింది. సహజమైన నటనతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Sai Pallavi - Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

|

Updated on: Jul 16, 2022 | 6:18 PM

విరాట పర్వంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఇందులో వెన్నెల పాత్రలో ఆమె ఒదిగిపోయింది. సహజమైన నటనతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ న్యాచురల్ బ్యూటీ తన తదుపరి చిత్రం గార్గి ప్రమోషన్‌లో బిజీగా ఉంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమాను జూలై 15న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న సాయి పల్లవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది.ఆయన వకీల్ సాబ్ చిత్రాన్ని కేవలం జనాల కోసమే చేశారని.. ఆయనలాంటి స్టేచర్, స్థాయి ఉన్న వ్యక్తులు అలాంటి సినిమాలు తీస్తే, మెసెజ్ చెబితే అందరూ వింటారని.. అందుకే అలాంటి సినిమాలు చేశారని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. లేడీ ఓరియెంటెడ్ గా వచ్చిన గార్గి మూవీలో సాయి పల్లవి స్కూల్ టీచర్ పాత్రలో నటించింది. ఈ సినిమా కేవలం మెసెజ్ ఓరియెంటెడ్ కాదని.. కానీ సినిమాను రెండున్నర గంటలు చూసి అక్కడే వదిలేయలేయకుండా వెంట తీసుకెళ్తారని తెలిపింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమా పై ఆసక్తిని పెంచింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Sugarcane Plantation: పైకి చెరకు తోటే.. లోపల యవ్వారం మాములుగా లేదుగా.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్…

Eyebrow Transplant: తల వెంట్రుకలతో ఐబ్రోస్‌ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ చివరికి.. షాక్..!

Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?

Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..

Follow us