Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..

స్నేహం ఎవరికీ ఎప్పుడు ఎలా ఎవరి మధ్య ఏర్పడుతుందో ఎవరికీ తెలియదు..ఒకొక్కసారి విచిత్రమైన మైత్రి అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కూడా..

Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..

|

Updated on: Jul 12, 2022 | 9:41 PM


స్నేహం ఎవరికీ ఎప్పుడు ఎలా ఎవరి మధ్య ఏర్పడుతుందో ఎవరికీ తెలియదు..ఒకొక్కసారి విచిత్రమైన మైత్రి అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కూడా.. తాజాగా యూపీలోని హమీర్‌పూర్ జిల్లాలో అటవీ శాఖ తోటమాలికి, జింక పిల్లకి మధ్య స్నేహం చర్చనీయాంశంగా మారింది. అరుదైన జాతికి పిల్ల ఒకటి మేకలతో పాటు తోటబాలి ఇంటికి చేరింది. అప్పటి నుంచి ఆ జింక పిల్లను తోటమాలి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అడవి జంతువుల నుండి కాపాడుతూ తగిన పోషణ అందిస్తున్నాడు. మేకలు కూడా ఈ జింక పిల్లలను తన బిడ్డగా భావించి చేరదీశాయి. ప్రస్తుతం ఈ జింక అటవీ శాఖ అధికారులకు ఓ పజిల్‌గా మిగిలిపోయింది!హమీర్‌పూర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిటీ ఫారెస్ట్ అనే స్థలాన్ని అటవీ శాఖ నిర్మించింది. దీని సంరక్షణకు ఖుషీరామ్ అనే వ్యక్తిని నియమించారు. కొద్దిరోజుల క్రితం.. ఖుషీరామ్ తన మేకలను మేపడానికి సమీప అడవుల్లో వదిలాడు. సాయంత్రం మేకల మందతో పాటు ఒక చిన్న జింక పిల్ల ఇంటికి తిరిగి వచ్చింది. జింక శరీరం నుండి రక్తం కారుతోంది. ఖుషీరామ్ దానిని చూసి చలించిపోయాడు.. వైద్యం చేయించాడు. ప్రస్తుతం ఈ జింక పిల్ల మేకల మంద మధ్య ఉంటూ మేకల పాలు తాగి పెరుగుతోంది. ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు జింకను చూడడానికి వక్కరు. జింకను పెంచే బాధ్యత తీసుకున్న అధికారులు పార్క్ తోటమాలికి అప్పగించారు. అప్పటినుంచి ఆ జింకపిల్లకు, తోటమాలికి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఖుషీరామ్ స్వరం వింటే చాలు ఆ జింక పిల్ల ఎక్కడ ఉన్నా వెంటనే అతని వద్దకు చేరుకుంటుంది. అతనితో ఆడుకుంటుంది. ఈ ఇద్దరి స్నేహాన్ని ఆసక్తిగా చూస్తున్నారు స్తానికులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Follow us