ఒంటిమిట్ట రాముడికి భక్తుడి భారీ విరాళం..
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయానికి ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రతాపరెడ్డి 2.07 కేజీల బరువున్న మూడు బంగారు కిరీటాలను విరాళంగా సమర్పించారు. సీతారామలక్ష్మణుల ఉత్సవ మూర్తుల కోసం ప్రత్యేకంగా చేయించిన ఈ కిరీటాలలో 164 గ్రాముల రత్నాలు పొదగబడ్డాయి. త్వరలో జరగనున్న కళ్యాణోత్సవాలకు ముందు అందిన ఈ భారీ విరాళం ఆలయ అధికారులు, భక్తులలో ఆనందం నింపింది. గతంలో 6 కేజీలు సహా, మొత్తం 8.5 కేజీల బంగారం ఆయన విరాళంగా ఇచ్చారు.
‘రెండో భద్రాద్రి’గా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి ఒక భక్తుడు భారీ విరాళం సమర్పించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రతాపరెడ్డి, స్వామివారిపై తన అపార భక్తిని చాటుతూ సుమారు 2 కేజీల 70 గ్రాముల బరువున్న మూడు బంగారు కిరీటాలను కోదండరాముడికి బహుకరించారు. త్వరలో జరగనున్న స్వామివారి కళ్యాణోత్సవాల నేపథ్యంలో ఈ కానుక ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్సవ మూర్తులైన సీతారామ లక్ష్మణుల కోసం ఈ కిరీటాలను ప్రత్యేకంగా చేయించారు. శ్రీరాముడి కోసం 670 గ్రాముల బంగారంతో అందమైన కిరీటం చేయించగా.. సీతమ్మకు 750 గ్రాముల బంగారంతో చక్కని కిరీటం చేయించారు. ఇక రాముడి అనుజుడు లక్ష్మణుడైన లక్ష్మణుడికి కూడా 650 గ్రాముల బంగారంతో చూడముచ్చడైన బంగారు కిరీటం చేయించారు. ఈ కిరీటాల తయారీలో కేవలం బంగారం మాత్రమే కాకుండా, సుమారు 164 గ్రాముల మేలిమి రత్నాలను కూడా పొదిగించడం విశేషం. ఉత్సవ సమయాల్లో స్వామివారు పురవీధుల్లో ఊరేగేటప్పుడు ఈ నూతన కిరీటాలను అలంకరించనున్నారు. పారిశ్రామికవేత్త ప్రతాపరెడ్డికి ఆలయంతో సుదీర్ఘ అనుబంధం ఉంది. గతంలోనే ఆయన మూలవిరాట్ కోసం 6 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. తాజాగా సమర్పించిన కిరీటాలతో కలిపి, ఇప్పటివరకు ఆయన ఒంటిమిట్ట ఆలయానికి మొత్తం 8.50 కేజీల బంగారాన్ని బహూకరించినట్లయింది. స్వామివారి కళ్యాణోత్సవ ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ఈ భారీ విరాళం అందడం పట్ల ఆలయ అధికారులు, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక గాడిదలు కాయటం.. వారికి మాత్రం కోట్ల లో వ్యాపారం
టెక్నాలజీ అంటే ఇదేరా సామీ.. పనిదొంగను పట్టేసిన AI
Chiranjeevi: వరప్రసాద్ ఎఫెక్ట్.. అస్సలు ఏ మాత్రం తగ్గని చిరు
టాలీవుడ్ లో నెంబర్ వన్ కుర్చీ దక్కించుకున్న ముద్దుగుమ్మ ఎవరో తెలుసా !
Ustaad Bhagat Singh: ఉస్తాద్ ఊహించని సర్‌ప్రైజ్.. ఫ్యాన్స్‌కు పండగే..
ఇక గాడిదలు కాయటం.. వారికి మాత్రం కోట్ల లో వ్యాపారం
టెక్నాలజీ అంటే ఇదేరా సామీ.. పనిదొంగను పట్టేసిన AI
వాట్సాప్ చాట్ ఆధారంగా విడాకులా ?? ఒరే.. మాంచి కథ కదురా ఇది
ట్రెండింగ్‌లో 'బాయ్‌కాట్ చాట్‌జీపీటీ'..
జంబలకిడిపంబ హోలీ చూసారా.. !!
ఏపీలో ఆందోళన కలిగిస్తున్న టీనేజ్ ప్రెగ్నెన్సీ
తెలంగాణలో మరణాలకు అడ్డాగా మారిన జాతీయ రహదారి

