Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?

ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ లో ఒకరిగా రాణిస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఇండస్ట్రీలో దాదాపు బడా హీరోలందరితో సినిమాలు చేశారు దిల్ రాజు. పెద్ద హీరోల సినిమాలే కాదు..

Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?

|

Updated on: Jul 12, 2022 | 9:53 PM


ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ లో ఒకరిగా రాణిస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఇండస్ట్రీలో దాదాపు బడా హీరోలందరితో సినిమాలు చేశారు దిల్ రాజు. పెద్ద హీరోల సినిమాలే కాదు.. కుర్ర హీరోలతోనూ సినిమాలు చేసి హిట్స్ అందుకున్నారు. అయితే చాలా కాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని చూసిన దిల్ రాజుకు ఎట్టకేలకు వకీల్ సాబ్ రూపంలో అవకాశం దక్కింది. పవర్ స్టార్ పర్ఫెక్ట్ కంబ్యాక్ గా వచ్చిన వకీల్ సాబ్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే దిల్ రాజుకు మరో కోరిక ఉందట. అదే మెగాస్టార్ చిరంజీవి సినిమా. మెగాస్టార్ సినిమాను ఎలాగైనా ప్రొడ్యూస్ చేయాలని ట్రై చేస్తున్నారు దిల్ రాజు. అదే తన డ్రీమ్ అని కూడా ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఆయన ఓన్ ప్రొడక్షన్ లోనే సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కొణిదల ప్రొడక్షన్ తో పాటు ఇతర బ్యానర్లతో ఆయన భాగస్వామ్యం అవుతూ సినిమాలు చేస్తున్నారు. దాంతో దిల్ రాజుకు చిరంజీవిని ప్రొడ్యూస్‌ చేసే అవకాశం దొరకడం లేదు. కానీ ఇప్పుడు ఆ మెగా ఛాన్స్ కొట్టేశారని తెలుస్తోంది. చిరంజీవి కోసం ఏకంగా ఆరు కథలను సిద్ధం చేయించారట దిల్ రాజు. మెగాస్టార్ కు వీలు కుదిరినప్పుడు ఆ కథలను వినిపించి ఏదో ఓ కథను ఓకే చేసి సినిమా చేయాలని చూస్తున్నారట ఈ స్టార్ ప్రొడ్యూసర్. ప్రస్తుతం చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత దిల్ రాజుకు అవకాశం వస్తుందని అంటున్నారు. మొత్తానికి మెగాస్టార్ సినిమాను ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ దిల్ రాజు కొట్టేశారన్నది ఫిలింనగర్ టాక్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Follow us