Maniratnam-Kamalhasan: మణిరత్నం కోసం రంగంలోకి కమల్‌హాసన్‌.. ఆ సినిమా కోసమేనా..

Maniratnam-Kamalhasan: మణిరత్నం కోసం రంగంలోకి కమల్‌హాసన్‌.. ఆ సినిమా కోసమేనా..

Anil kumar poka

|

Updated on: Jul 12, 2022 | 9:33 PM

సినిమా ఇండస్ట్రీలో మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు మణిరత్నం. హిట్‌..ప్లాప్‌తో సంబంధం లేకుండా ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించిన మణిరత్నం తాజాగా..


సినిమా ఇండస్ట్రీలో మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు మణిరత్నం. హిట్‌..ప్లాప్‌తో సంబంధం లేకుండా ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించిన మణిరత్నం తాజాగా ఓ భారీ ప్రాజెక్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తొలిసారి మణిరత్నం పొన్నియన్ సెల్వన్ అనే హిస్టారికల్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పై మొదటినుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో విక్రమ్‌, జ‌యం ర‌వి, కార్తి, ఐశ్వర్యా రాయ్‌, త్రిష ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‏తో అత్యంత ప్రతిష్టాత్మకంగా హిస్టారికల్ ఎపిక్ మూవీగా వస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నారు. కాగా ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇటీవలే ఈ సినిమానుంచి టీజర్ ను రిలీజ్ చేశారు మణిరత్నం.ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూట్యూబ్, ట్విట్టర్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ సినిమాకోసం లోకనాయకుడు కమల్ హాసన్ రంగంలోకి దిగారు. పొన్నియన్ సెల్వన్ తమిళ్ వర్షన్ కు కమల్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అలాగే ఒక్కొక్క భాషల్లో ఒక్కో స్టార్ హీరో ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట. మణిరత్నం, కమల్ హాసన్ కు మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. ఆ స్నేహంతోనే కమల్‌ను పొన్నియన్‌ సెల్వన్‌ తమిళ్‌ వెర్షన్‌కు వాయిస్‌ ఇవ్వాలని కోరారట మణిరత్నం. ఇక కమల్ హాసన్ ఇటీవలే విక్రమ్ సినిమాతో తన విశ్వరూపం చూపించిన విషయం తెలిసిందే.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Published on: Jul 12, 2022 09:33 PM