Viral News: ఏలియన్స్ ఉన్నారు.. భూమి మీదకు వచ్చారు.. అందుకు రుజువే ఈ పాన్ కేక్ అంటోన్న రచయిత..
ఇటీవల ప్రచురించబడిన ఓ పుస్తకంలో .. గ్రహాంతరవాసులు భూమిపై వదిలివేసిన వాటిలో.. పాన్‌కేక్ కూడా ఉందని పేర్కొంది. అంతేకాదు కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర వస్తువులు కూడా భూమిపై మిగిలిపోయాయని తెలిపింది.
Viral News: ప్రపంచం ఆధునిక సాంకేతిక రంగంలో చుక్కలను, చంద్రుడిని అందుకున్నా.. సముద్రంలో వింతలు విశేషాలను వెలుగులోకి తెచ్చినా.. నేటికీ మనిషి మేధస్సుకు అందరిని ఎన్నో మిస్టరీలున్నాయి. అలాంటి మిస్టరీలో UFOలు, గ్రహాంతరవాసులు వంటి అంశాలు కూడా ఉన్నాయి. గ్రహాంతరవాసులు నిజంగా భూమిపైకి వచ్చారా.. జీవించారా..? ఈ ప్రశ్నలు చాలా సంవత్సరాలుగా మానవులకు చేధించలేని సవాల్ గా మారాయి. ఎన్ని దశాబ్దాలు గడచినా ఇప్పటికీ ఎలిన్స్ భూమి మీదకు వచ్చారా అన్న ప్రశ్నకు సరైన సమాధానం లేదు. గ్రహాంతరవాసులు భూమి మీదకు వచ్చారని కొంతమంది విశ్వసిస్తున్నప్పటికీ.. అధికారికంగా ఏలియన్స్ జాడ గురించి కనుగొనబడలేదు. అయితే కొంతమంది వ్యక్తులు తాము గ్రహాంతరవాసులని చెప్పుకుంటారు. కొన్నిసార్లు ఏలియన్స్ ఉనికికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొంటారు. అలాంటి కొన్ని ఆధారాలతో కూడిన పుస్తకం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ పుస్తకంలో వింత వాదనలను కూడా వినిపించారు.
ఈ పుస్తకం పేరు Alien Artifacts: Incredible Evidence of Exotic Material From UFO Encounters , రచయిత CM Kastil అండ్ R Swartz టీమ్. గ్రహాంతర వాసులు ఇప్పటి వరకు చాలాసార్లు భూమిపైకి వచ్చారని.. వారు తమ వెంట తెచ్చిన ఎన్నో వస్తువులను భూమి మీద వదిలేశారని ఆయన పేర్కొన్నారు.
అడ్వాన్స్ స్టేజ్ లో గ్రహాంతరవాసుల సాంకేతికత ఇటీవల ప్రచురించబడిన ఈ పుస్తకంలో .. గ్రహాంతరవాసులు భూమిపై వదిలివేసిన వాటిలో.. పాన్‌కేక్ కూడా ఉందని పేర్కొంది. అంతేకాదు కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర వస్తువులు కూడా భూమిపై మిగిలిపోయాయని తెలిపింది. ఆ వస్తువులు చాలా విచిత్రమైనవని.. మనుషులకు అర్థం కానివని చెప్పారు. గ్రహాంతరవాసుల సాంకేతికత మానవుల కంటే చాలా అధునాతనమైనదని.. దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, అయితే దీనికి చాలా మేథస్సు అవసరమని పేర్కొన్నారు.
సంవత్సరాల క్రితమే క్రాష్ UFO నుండి వస్తువులు: 1954లో, బ్రెజిల్‌లో గ్రహాంతరవాసుల విమానం అంటే UFO కొన్ని కారణాల వల్ల కూలిపోయిందని పుస్తకంలో తెలిపారు. విమాన శకలాలతో పాటు, గ్రహాంతరవాసులకు సంబంధించిన అనేక వస్తువులు కూడా లభించాయని పేర్కొన్నారు. ఆ విమానంలోని వస్తువులను శకలాలను చూస్తే..అది మానవులది కాదని.. మరో గ్రహం అంటే గ్రహాంతరవాసులకు సంబంధించినదని అంచనా వేశారు. ఈ క్రాష్‌లో గ్రహాంతరవాసుల మిగిలిపోయిన పాన్‌కేక్ కూడా వెలుగులోకి వచ్చింది. దీని గురించి చాలా వాదనలుకూడా ఉన్నాయి.
కొంతమంది UFO నిపుణులు .. ఈ విమాన శకలాలను బెలూన్ ముక్క అని చెప్పారు. అంతేకాదు.. గ్రహాంతరవాసుల ఉనికిని పూర్తిగా తిరస్కరించారు, అయితే కొందరు పాన్ కేక్ ను గ్రహాంతరవాసుల ఆహారంగా భావిస్తున్నారు. ఏది ఏమైనా ఏలియన్స్ ఉన్నారా.. భూమి మీద కు వచ్చారా లేదా అనేది.. ఆ పుస్తకం రాసిన రచయితకు మాత్రమే తెలిసిన నిజం అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..