Hindu Woman In Pak: పాకిస్తాన్‌లో చరిత్ర సృష్టించిన హిందూ మహిళ.. డీఎస్పీగా పదవి.. ఫ్యామిలీ మొత్తం డాక్టర్లే..

మనీషా ముగ్గురు అక్కచెల్లెలు డాక్టర్లు.. ఆమె తమ్ముడు కూడా మెడిసిన్ చదువుతున్నాడు. అయితే మనిషా కూడా డాక్టర్ చదవడం కోసం ప్రిపేర్ అయింది. కానీ MBBS ఎంట్రెన్స్ లో ఒక మార్కుతో తేడాతో సీటుని కోల్పోయింది.

Hindu Woman In Pak: పాకిస్తాన్‌లో చరిత్ర సృష్టించిన హిందూ మహిళ.. డీఎస్పీగా పదవి.. ఫ్యామిలీ మొత్తం డాక్టర్లే..
Pak First Hindu Woman Dsp
Follow us

|

Updated on: Jul 29, 2022 | 11:01 AM

Hindu Woman In Pak:  పాకిస్తాన్‌లో మరో అరుదైన ఘటన చోటుచేసుకుంది. అక్కడ కూడా హిందువులకు ప్రాధాన్యత ఉంటుందని నిరూపితమైంది. తాజాగా ఓ హిందూ మహిళ.. పాకిస్తాన్‌లో సంచలనం సృష్టించింది. పోలీసు శాఖలో కీలక బాధ్యతలు అందుకుని.. ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. 26 ఏళ్ల హిందూ మహిళ మనీషా రోపేటా రికార్డులు బ్రేక్‌ చేశారు. పోలీస్ శాఖలో ఉన్నతంగా భావించే డిప్యూటీ సూపరింటెండెంట్ పదవిని అందుకుందన్న తొలి హిందూ మహిళగా గుర్తింపు పొందారు. ఈ స్థానానికి చేరిన తొలి హిందు మహిళగా హిస్టరీ క్రియేట్‌ చేశారు. సింధ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ నిర్వహిచిన పరీక్ష్లలో 468 మంది అభ్యర్థుల్లో 16వ స్థానంలో మనీషా నిలిచారు. కాగా, ప్రస్తుతం.. మనీషా రోపేటా డీఎస్పీగా లియారీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు.

సింధ్ ప్రావిన్స్ జకోబాబాద్‌ ప్రాంతంలో మధ్య తరగతి కుటుంబానికి చెందిన మనీషా 13వ ఏట తండ్రి మరణించారు. తల్లి కరాచీకి తీసుకువచ్చి పిల్లలను ఎంతో కష్టపడి చదివించారు. డీఎస్పీగా బాధత్యలు స్వీకరించిన తర్వాత మనీషా రోపేటా మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి.. తాను, తన సోదరీమణులు పితృస్వామ్య వ్యవస్థను చూసినట్టు తెలిపారు. సమాజంలో మహిళలు అణచివేతకు గురవుతున్నారన్నారు. అలాంటి వారికి అండగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నించినట్టు స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లో అమ్మాయిలకు ఎక్కువగా.. డాక్టర్ లేదా టీచర్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని వెల్లడించారు. పోలీసు శాఖల్లో కూడా మహిళా ప్రాతినిథ్యం ఉండాలనే ఉద్దేశ్యంతోనే పోలీస్ శాఖలో చేరినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

సీనియర్ పోలీసు అధికారిగా పని చేయడం మహిళలకు అధికారాన్ని మరింత దగ్గరకు చేస్తుందని మనీషా రోపేటా చెప్పారు. తాను పోలీసు వ్యవస్థలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించాలనుకుంటున్నానని చెప్పారు. పోలీసు వృత్తి పట్ల చాలా స్ఫూర్తిని పొందానని ఆకర్షితుడిని అయ్యానని చెప్పారు.

మనీషా ముగ్గురు అక్కచెల్లెలు డాక్టర్లు.. ఆమె తమ్ముడు కూడా మెడిసిన్ చదువుతున్నాడు. అయితే మనిషా కూడా డాక్టర్ చదవడం కోసం ప్రిపేర్ అయింది. కానీ MBBS ఎంట్రెన్స్ లో ఒక మార్కుతో తేడాతో సీటుని కోల్పోయింది. దీంతో ఫిజియో థెరపీతో డిగ్రీ తీసుకోవాలని భావించింది. అయితే  అదే సమయంలో మనిషా సింధ్ పబ్లిక్ సర్వీసెస్ కమీషన్ పరీక్షలకు సిద్ధమ.. 468 మంది అభ్యర్థులలో 16వ స్థానంలో ఉత్తీర్ణత సాధించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
షారుక్ కోసం అభిమాని సాహసం..
షారుక్ కోసం అభిమాని సాహసం..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..