AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాత తోప్ నటుడు.. మనవరాలు ఫ్లాప్ హీరోయిన్.. కట్ చేస్తే సినిమాలు మానేసి ఇలా..

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది నటవారసులు రాణిస్తున్నారు. వారిలో ఈ అందాల భామ ఒకరు. ఆమె తాత ఇండస్ట్రీలో తోప్ నటుడు. ఎన్నో వందల సినిమాల్లో నటించి మెప్పించారు. కానీ ఆమె మాత్రం పెద్ద సక్సెస్ కాలేకపోయింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

తాత తోప్ నటుడు.. మనవరాలు ఫ్లాప్ హీరోయిన్.. కట్ చేస్తే సినిమాలు మానేసి ఇలా..
Actress
Rajeev Rayala
|

Updated on: Mar 17, 2026 | 8:59 PM

Share

యంగ్ హీరోయిన్స్ వరుసగా సినిమాలతో దూసుకుపోతున్నారు. కొత్త కొత్త భామలు వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులు మెప్పిస్తున్నారు. ఇక వారిలో ఈ అందాల భామ ఒకరు. సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది నటవారసులు సినిమాల్లో రాణిస్తున్నారు. కొందరు సక్సెస్ అయితే మరికొంతమంది మాత్రం హిట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతుంది.కానీ ఆమె తాత ఇండస్ట్రీలో తోప్ నటుడు. ఓ లెజెండరీ యాక్టర్ మనవరాలు ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడి తాత ఏకంగా 965 సినిమాల్లో నటించి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరు.? ఆమె తాత ఎవరు అనేది ఒక్కసారి చూద్దాం..!

Pawan Kalyan: రాజకీయాల్లోకి రావచ్చుగా.. హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ ఆఫర్.. కానీ ఆమె ఏం చెప్పిందంటే

ఆమె ఎవరో కాదు బుల్లి తెరపై మంచి క్రేజ్ సొంతం చేసుకున్న శృతిక అర్జున్. ఈ అందాల భామ తమిళ్ సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తమిళ్, మలయాళ సినిమాల్లో పనిచేసింది, తర్వాత రియాలిటీ షోల ద్వారా బాగా పాపులర్ అయింది. ఆమె తాతగారు ప్రసిద్ధ తమిళ్ కామెడియన్ తేంగాయ్ శ్రీనివాసన్. వందల సినిమాల్లో నటించి మెప్పించారు ఆయన. ఆయన కేవలం కమెడియన్‌గా మాత్రమే కాకుండా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, చివరికి హీరోగా కూడా అదరగొట్టాడు.

ఇవి కూడా చదవండి

వెంకటేష్ నా ప్రాణం కాపాడారు.. ఆ రోజు ఆయన లేకపోయి ఉంటే వామ్మో..!!

ఇక ఆయన మనవరాలు శృతిక అర్జున్. 2002లో 14-15 ఏళ్ల వయసులో తమిళ్ సినిమా శ్రీలో సూర్యతో హీరోయిన్‌గా డెబ్యూ చేసింది. తర్వాత తిత్తికుదే , ఆల్బమ్ వంటి తమిళ్ సినిమాలు, మలయాళంలో స్వప్నం కొండు తులాభారం వంటి సినిమాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు ఎక్కువగా విజయవంతం కాలేదు. 2003-2004 తర్వాత ఆమె యాక్టింగ్ ను వదిలేసి ఇండస్ట్రీకి దూరం అయ్యింది. 2022లో ఓ రియాలిటీ షో పాల్గొని విన్నర్ అయింది. ఇది ఆమెకు తిరిగి క్రేజ్ ను  తెచ్చిపెట్టింది. 2024లో బిగ్ బాస్ 18 (హిందీ)లో పాల్గొని పాపులర్ అయ్యింది. ఈ అందాల భామ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

Roja Selvamani: స్టార్ హీరో ఇంటికి కోడలిగా రోజా కూతురు..? ఇదిగో క్లారిటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us