Thailand: ఏం క్రియేటివిటీ సామీ.. ప్రభుత్వం అలా అనుమతి ఇవ్వడమే ఆలస్యం.. రెచ్చిపోతున్నారుగా..!

Thailand: గంజాయి వాడకం అన్ని దేశాల్లో నిషేధం. కానీ థాయిలాండ్‌లో చట్టబద్దం. ఇంకేముంది.. దీంతో పేస్టులు, సబ్బులు, టీ, స్నాక్స్‌ చేసుకొని..

Thailand: ఏం క్రియేటివిటీ సామీ.. ప్రభుత్వం అలా అనుమతి ఇవ్వడమే ఆలస్యం.. రెచ్చిపోతున్నారుగా..!
Ganja
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 29, 2022 | 9:35 AM

Thailand: గంజాయి వాడకం అన్ని దేశాల్లో నిషేధం. కానీ థాయిలాండ్‌లో చట్టబద్దం. ఇంకేముంది.. దీంతో పేస్టులు, సబ్బులు, టీ, స్నాక్స్‌ చేసుకొని తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు థాయ్‌ ప్రజలు. వాస్తవానికి గంజాయి ఓ మత్తు పదార్థం.. జీవితాలను నాశనం చేస్తుంది. భారత్‌తో సహా అనేక దేశాల్లో దీన్ని కొనడం, అమ్మడం, వాడటం నిషేధం. కానీ థాయ్‌లాండ్‌ ప్రభుత్వం గత నెలలో గంజాయి వాడకాన్ని చట్టబద్దం చేసేసింది. అయితే ఇక్కడో ట్విస్టు ఉంది.. గంజాయిని కేవలం వైద్య ప్రయోజనాలకు మాత్రమే వాడాలి. బహిరంగ ప్రదేశాల్లో దీన్ని తాగితే శిక్ష తప్పదని హెచ్చరించింది థాయ్‌ ప్రభుత్వం. దీన్ని ఉల్లంఘిస్తే మూడు నెలల జైలు శిక్ష.. రూ. 60 వేల జరిమానా తప్పదని స్పష్టంగా చెప్పింది. గంజాయిని సానుకూల మార్గంలోనే ఉపయోగించుకొని తమ దేశీయులు ధనవంతులు కావాలని ఆశిస్తున్నామని థాయ్‌ ఆరోగ్య మంత్రి అనుతిన్ చార్న్‌విరాకుల్ గత నెలలో ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఇప్పుడు ఆయన ఆశలను ఆచరణాత్మకంగా పాటించి చూపిస్తున్నారు థాయ్‌లాండ్‌ వ్యాపారులు.

ప్రభుత్వం గంజాయితో సానుకూల వ్యాపారం చేసుకోడానికి అనుమతి ఇచ్చేయడంతో తమ క్రియేటివిటీకి మెరుగులు దిద్దారు థాయ్‌ వ్యాపారులు. గంజాయితో తయారైన టూత్‌పేస్ట్‌కు మంచి డిమాండ్‌ ఏర్పడింది. దీంతో సబ్బులను కూడా తయారు చేస్తున్నారు. మరోవైపు రకరకాల స్నాక్స్‌ కూడా గంజాయితో తయారవుతున్నాయి. వేడి వేడి గంజాయి బజ్జీలు, మొమోస్‌ కూడా అమ్మకానికి పెట్టారు. అంతే కాదు గంజాయి కలిపిన టీ, కాఫీలకు కూడా మాంచి డిమాండ్‌ ఏర్పడింది. థాయ్‌ సాంప్రదాయ వైద్యంలో గంజాయిని నొప్పులు తగ్గించేందుకు ఉపయోగించడం సర్వసాధారణం. ఇప్పుడు దీన్ని ఔషధం పేరుతో అన్ని రకాల ఆహార పదార్థాల తయారీలోనూ ఉపయోగించేస్తున్నారు. ఈ విషయంలో థాయ్‌ వ్యాపారుల క్రియేటివిటీ అదిరిపోయింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!