AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాడు స్టార్స్‌పై.. నేడు పొలిటికల్ ‘సిట్’..! అసలు ‘డాన్’లు దొరికేది ఎప్పుడు..

డ్రగ్స్‌పై 'జీరో టాలరెన్స్' పాలసీ తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు పూర్తి అధికారాలు ఇచ్చారు. దీనికి అనుబంధంగా 'ఈగల్' పేరుతో ఎలైట్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి, దానికి అధునాతన సాంకేతికతను అందించారు. రాజకీయ ముద్ర లేకుండా విచారణ జరపాలనేది మెయిన్ టార్గెట్..

నాడు స్టార్స్‌పై.. నేడు పొలిటికల్ 'సిట్'..! అసలు 'డాన్'లు దొరికేది ఎప్పుడు..
Telangana Drug Case
Shaik Madar Saheb
|

Updated on: Mar 17, 2026 | 9:49 PM

Share

డ్రగ్స్ కేస్ అనగానే.. చాలా హడావుడి కనిపిస్తుంది. ఎవరైనా సెలబ్రిటీస్ ఆ డ్రగ్స్ పార్టీలో ఉన్నారని తెలిస్తే.. ఇక మామూలుగా ఉండదు ఆ హడావుడి. బట్.. విత్ ఇన్ డేస్‌లోనే అంతా చప్పబడిపోతుంది. ఎక్కడి వాళ్లు అక్కడే గప్‌చుప్. ఫర్ ఎగ్జాంపుల్.. అకున్ సబర్వాల్ సిట్. ఆనాడు ఎంత మంది సినీ సెలబ్రిటీస్ విచారణకు హాజరయ్యారో చూశాం. ఒక్కో రోజు ఒక్కొక్క సినీ ప్రముఖుడు సిట్ ముందు అటెండ్ అయ్యారు. కెమెరాలన్నీ అటువైపే తిరిగాయి. ఒక్కొక్కరిని ఐదారు గంటలు, 10-12 గంటలు కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తే.. అంతసేపూ బ్రేకింగ్స్ నడిచాయ్‌. మరి ఏమైందా కేసు? అకున్ సబర్వాల్ సిట్ ఏమని రిపోర్ట్ ఇచ్చింది? డ్రగ్స్‌పై ‘జీరో టాలరెన్స్’ పాలసీ తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు పూర్తి అధికారాలు ఇచ్చారు. దీనికి అనుబంధంగా ‘ఈగల్’ పేరుతో ఎలైట్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి, దానికి అధునాతన సాంకేతికతను అందించారు. రాజకీయ ముద్ర లేకుండా విచారణ జరపాలనేది మెయిన్ టార్గెట్. గతంలో కేవలం సినీ తారలకే పరిమితమైన విచారణను, ఇప్పుడు రాజకీయ నాయకుల వైపు మళ్లించారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసుపై సిట్ వేశారు. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్‌ను సిట్ చీఫ్‌గా అపాయింట్ చేశారు. గ్రేహౌండ్స్ కమాండర్ రవీందర్ రెడ్డి, షాద్ నగర్ డీసీపీ శిరీష, ఈగల్ ఫోర్స్ ఆఫీసర్లు హరీష్ చంద్రారెడ్డి, బుచ్చయ్య, మొయినాబాద్ SHO మల్లికార్జున రెడ్డి, ఎస్‌ఐలు కోటేశ్వరరావు,...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి