Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: తండ్రి పేరుమీదుగా ఆస్పత్రిని నిర్మించనున్న చిరు.. మేము సైతం అంటోన్న శ్రీకాంత్, తరుణ్, సుధీర్, థమన్..

సొంతలాభం కొంత మాని- పొరుగు వారికి సాయ పడవోయ్ అని పిలుపునిస్తూ.. డల్లాస్ క్రికెట్ ట్రోఫీ.. జర్సీ విడుదల చేశారు చిరంజీవి. ఇంతకీ ఎప్పుడు జరుగుతుందీ ట్రోఫీ? ఈ చారిటీ మ్యాచ్ ద్వారా వచ్చిన మొత్తం ఎలాంటి కార్యక్రమాలకు వాడబోతున్నారు? ఇందులో మెగా స్టార్ పాత్ర ఎంత?

Megastar Chiranjeevi: తండ్రి పేరుమీదుగా ఆస్పత్రిని నిర్మించనున్న చిరు.. మేము సైతం అంటోన్న శ్రీకాంత్, తరుణ్, సుధీర్, థమన్..
Chiranjeevi
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Aug 20, 2022 | 7:37 PM

Megastar Chiranjeevi:  ఇప్పటి వరకూ టాలీవుడ్ తారాలోకం.. తెలుగు రాష్ట్రాల్లో లేదా చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో మాత్రమే క్రికెట్ ఆడ్డం చూశాం..సెప్టంబర్ 24 నుంచి అమెరికాలోని డల్లాస్ లోనూ క్రికెట్ ఆడుతున్నారు మన సినీ క్రికెటర్లు.. అందుకు గానూ.. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా జెర్సీలను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు తారలు క్రికెట్ మ్యాచ్ నిర్వహణపై.. స్పందించారు. స్టేజ్ పై మెగాస్టార్ చిరంజీవి బర్త్డే కేక్ కట్ చేసి.. ముందుగానే చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలను చెప్పారు. ఈ సందర్భంగా చిరంజీవి ఈ సారి బర్త్ డే సందర్భంగా తానొక మంచి నిర్ణయం తీసుకున్నాననీ.. చిత్రపురి కాలనీలో ఒక ఆస్పత్రి నిర్మించాలనుకుంటున్నానని చెప్పారు. తన తండ్రి పేరుమీదుగా ఆస్పత్రిని నిర్మించనున్నామని ప్రకటించారు. ఈ ఆస్పత్రి నిర్మాణం కోసం ఎంత ఖర్చయినా వెనుకాడనని చెప్పారు. అంతే కాదు తాను చేసే పనులకు పెద్దగా ప్రచారం అవసరం లేదనీ. అయితే సమాచారం మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలనీ. అలా జరగడం వల్ల.. పది మంది కీ తెలిసి.. వాళ్లు కూడా ఇన్ స్పిరేషన్ గా తీసుకుని.. మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతారనీ చెప్పుకొచ్చారు మెగాస్టార్.

తామంతా కలసి ఒక మంచి కాజ్ కోసం ఈ క్రికెట్ ఆడుతున్నామని అన్నారు సుధీర్ బాబు. ఈసారి చిత్రపురి కాలనీ కోసం ఒక ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పారు  తరుణ్. ఇదే కార్యక్రమంలో మాట్లాడిన ప్రకాష్ రాజ్.. ఉభయకుశలోపరిగా జరిగే ఈ కార్యక్రమం ఒక సాంస్కృతిక వారధిగా నిలవాలనీ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారనీ. అది గమనించిన తాము ఈసారి డల్లాస్ ట్రోఫీ ద్వారా వచ్చే కొంత మొత్తం.. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కు ఇవ్వాలనుకుంటున్నామనీ చెప్పారు శ్రీకాంత్. ఇండస్ట్రీకి ఓపెనింగ్ బ్యాట్స్ మెనే చిరంజీవనీ. అందునా ఇలాంటి చారిటీ వర్క్స్ లో మాకొక ఇన్ స్పిరేషననీ.. చిత్రపురి ఆస్పత్రి కోసం తన వంతుగా.. మ్యూజిక్ ప్రొగ్రాం నిర్వహించి.. తద్వారా.. వచ్చిన మొత్తం ఆస్పత్రి కోసం ఇస్తానని ముందుకొచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్.

ఈ కర్టెన్ రైజర్ ప్రొగ్రాం.. కేవలం సినీ గ్లామర్ తో కలర్ ఫుల్ గా మాత్రమే కాదు.. ఒకింత ఇన్ స్పిరేషనల్ గా- మరి కొంత.. ఎమోషనల్ గానూ సాగడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..