Namitha: కవలలకు జన్మనిచ్చిన సినీ నటి నమిత.. అభిమానుల ఆశీర్వాదాలు కావాలంటూ పోస్ట్

తెలుగు ప్రేక్షకులకు చేరువైన నిమిత.. పండంటి కవలలకు జన్మనిచ్చింది. ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చినట్టు తెలిపారు. తామంతా ఆరోగ్యంగానే ఉన్నామని, అభిమానుల..

Namitha: కవలలకు జన్మనిచ్చిన సినీ నటి నమిత.. అభిమానుల ఆశీర్వాదాలు కావాలంటూ పోస్ట్
Namitha
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 20, 2022 | 7:37 PM

తెలుగు ప్రేక్షకులకు చేరువైన నిమిత.. పండంటి కవలలకు జన్మనిచ్చింది. ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చినట్టు తెలిపారు. తామంతా ఆరోగ్యంగానే ఉన్నామని, అభిమానుల ఆశీస్సులు తమకు ఉండాలని కోరారు. కవలలను ఎత్తుకొని భర్తతో ఉన్న వీడియోను పంచుకున్నారు. ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో విజయవంతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. సొంతం సినిమాతో పరిచయమయ్యి.. వెంకటేశ్ సరసన జెమిని సినిమాలో, ఒక రాజు ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి, నాయకుడు, బిల్లా, సింహా వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కొన్ని కారణాల వల్ల ఈమె లావుగా మారడంతో తొలుగు అవకాశాలు తగ్గాయి. దీంతో ఆమె చెన్నైకు మకాం మార్చేసింది. తమిళం, మలయాళం, కన్నడ భాషలలో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా మారిపోయింది. 2017లో కోలీవుడ్ యాక్టర్ వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Namita Vankawala Chowdhary (@namita.official)

కాగా.. గతంలో తాను తల్లిని కాబోతున్నానంటూ బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుందని, మాతృత్వం మర్చిపోలేని అనుభూతినిస్తుందని పేర్కొంది. తన ముఖంలో చిరునవ్వు వచ్చిందని, ఈ రోజు కోసం ఎన్నో రోజులు వెయిట్ చేశానని తెలిపింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!
మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!
ఏపీలో విచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
ఏపీలో విచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
వేసవిలో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా IRCTC ప్యాకేజీ
వేసవిలో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా IRCTC ప్యాకేజీ
అదరగొట్టిన కోహ్లీ, పాటిదార్.. హైదరాబాద్ టార్గెట్ 207
అదరగొట్టిన కోహ్లీ, పాటిదార్.. హైదరాబాద్ టార్గెట్ 207
Viral: చెరువు దగ్గర మట్టిలో వింత ఆకారం.. తవ్వి చూడగా.!
Viral: చెరువు దగ్గర మట్టిలో వింత ఆకారం.. తవ్వి చూడగా.!
చిరంజీవి మృగరాజు సినిమాలో ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..
చిరంజీవి మృగరాజు సినిమాలో ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..
రోడ్డు పై భారీగా ట్రాఫిక్ జామ్.. జేసీబీ డ్రైవర్ నిర్వాకంతో..
రోడ్డు పై భారీగా ట్రాఫిక్ జామ్.. జేసీబీ డ్రైవర్ నిర్వాకంతో..