AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రామంతాపూర్‌ నారాయణ కాలేజ్‌ ఘటనపై మంత్రి సబితా సీరియస్‌.. ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు!

రామంతాపూర్‌ నారాయణ కాలేజ్‌ ఘటనపై మంత్రి సబితా సీరియస్‌ అయ్యారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఇంటర్‌ బోర్డు కార్యదర్శిని ఆదేశించారు. విచారణ నివేదిక అందిన వెంటనే..

Telangana: రామంతాపూర్‌ నారాయణ కాలేజ్‌ ఘటనపై మంత్రి సబితా సీరియస్‌.. ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు!
Inter Student Suicide
Srilakshmi C
|

Updated on: Aug 19, 2022 | 9:55 PM

Share

High tension at Ramanthapur Narayana College: రామంతాపూర్‌ నారాయణ కాలేజ్‌ ఘటనపై మంత్రి సబితా సీరియస్‌ అయ్యారు. ఈ కాలేజీలో ఇంటర్ పూర్తైన సాయి నారాయణ అనే విద్యార్ధి స్టూడెంట్‌ యూనియన్‌ లీడర్‌ సందీప్‌తో కలిసి టీసీ కోసం ప్రిన్సిపాల్‌ గదికి వెళ్లాడు. డ్యూ ఉన్న రూ. 16,000ల ఫీజు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని ప్రిన్సిపాల్ సుధాకర్ చెప్పాడు. ఈ క్రమంలో ప్రిన్సిపాల్‌కు, స్టూడెంట్‌ యూనియన్‌ లీడర్‌ సందీప్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సందీప్‌ ప్రిన్సిపాల్‌ ఎదుటే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో సందీప్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సందీప్‌ సహా వెంకటేష్‌చారీ, కాలేజ్‌ ఏవో అశోక్‌కు డీఆర్‌డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీపై దాడి చేయగా అద్దాలు పగిలిపోయాయి. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నొలకొనడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు.

కాగా ఈ ఘటనపై స్పందించిన తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఇంటర్‌ బోర్డు కార్యదర్శిని ఆదేశించారు. విచారణ నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, భవిష్యుత్తలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి సబితా అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

జూనియర్ కాలేజీలకు ఇంటర్‌ బోర్డు కీలక ఆదేశాలు తాజా నారాయణ కాలేజీ ఘటన నేపథ్యంలో తెలంగాణలో అన్ని జూనియర్ కాలేజీలకు ఇంటర్‌ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్ పూర్తి చేసుకుని కాలేజీ వదిలి వెళ్లే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశించింది. ఇతర కారణాలతో సర్టిఫికెట్లు ఇవ్వకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. సర్టిఫికెట్ల జారీ కాలేజీ ప్రిన్సిపాల్ బాధ్యతేనని ఇంటర్ బోర్డు తెల్పింది. ఈ మేరకు జిల్లా ఇంటర్ విద్యా అధికారులు జూనియర్ కాలేజీల్లో తనిఖీలు చేయాలని బోర్డు ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘస్తే కాలేజీ యాజమన్యాలపై కఠిన చర్యలు తప్పవని ఇంటర్ బోర్డు హెచ్చిరించింది.