Telangana: ప్రియురాలికి వేరొకరితో పెళ్లి.. సడెన్ ట్విస్ట్ ఇచ్చిన ప్రియుడు.. ఏకంగా ఫోటోలు పట్టుకుని..

Telangana: ప్రేమించిన యువకుడు తనను మోసం చేశాడంటూ యువతులు నిసన చేసిన ఘనటలు ఎన్నో చూశానం. కానీ, యువతి మోసం చేసిందంటూ అబ్బాయిలు రోడ్డుకెక్కడం..

Telangana: ప్రియురాలికి వేరొకరితో పెళ్లి.. సడెన్ ట్విస్ట్ ఇచ్చిన ప్రియుడు.. ఏకంగా ఫోటోలు పట్టుకుని..
Man Protest
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 19, 2022 | 9:41 PM

Telangana: ప్రేమించిన యువకుడు తనను మోసం చేశాడంటూ యువతులు నిసన చేసిన ఘనటలు ఎన్నో చూశానం. కానీ, యువతి మోసం చేసిందంటూ అబ్బాయిలు రోడ్డుకెక్కడం ఎప్పుడైనా చూశారా? ఇలాంటి ఘటనే తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదెల గ్రామంలో పెళ్లి వేడుకల్లో ట్విస్ట్ ఇచ్చాడు ప్రియుడు. తనను కాదని మరో యువకుడిని పెళ్లి‌ చేసుకుంటుందంటూ.. ప్రియురాలి ఇంటి ఎదుట ఆందోళనకు దిగాడు ప్రియుడు. ఆరేళ్లుగా ప్రేమించి మరో వ్యక్తితో పెళ్లి ఒప్పుకుందని ఆందోళన చేపట్టాడు. యువతికి ఎన్నో గిఫ్ట్‌లు, డబ్బు, బంగారు నగలు కూడా ఇచ్చానని చెప్పుకొచ్చాడు. తనకు న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు యువకుడు. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు పట్టుకుని అందరికీ చూపిస్తూ ధర్నా చేశాడు. తన ప్రియురాలు ఆమె కుటుంబ సభ్యులకు భయపడి వేరే పెళ్లికి సిద్ధమైందని యువకుడు ఆరోపించాడు. కాగా, ప్రియుడి నిరసనతో ఆ పెళ్లి కాస్తా నిలిచిపోయింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..