Telangana: ఆ రాష్ట్రాల్లో కరెంట్ కోతలపై సమాధానం చెప్పలేకే తెలంగాణపై కేంద్రం కక్ష.. మంత్రి జగదీష్‌ రెడ్డి ఫైర్..

Telangana: పవర్ ఎక్స్ఛేంజ్‌‌పై టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల వార్ కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పవర్ ఎక్స్ఛేంజ్‌‌ విషయంలో నిషేధం..

Telangana: ఆ రాష్ట్రాల్లో కరెంట్ కోతలపై సమాధానం చెప్పలేకే తెలంగాణపై కేంద్రం కక్ష.. మంత్రి జగదీష్‌ రెడ్డి ఫైర్..
Jagadish Reddy
Follow us

|

Updated on: Aug 19, 2022 | 8:07 PM

Telangana: పవర్ ఎక్స్ఛేంజ్‌‌పై టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల వార్ కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పవర్ ఎక్స్ఛేంజ్‌‌ విషయంలో నిషేధం విధించిందని విమర్శించారు మంత్రి జగదీశ్వర్‌రెడ్డి. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన మంత్రి.. విద్యుత్ విషయంలో కేంద్రం చర్యలు దుర్మార్గమని, రాష్టాల అభివృద్ధి అడ్డుకోవడమెనని మంత్రి జగదీష్ రెడ్డి మండి పడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఒక్క రూపాయి బిల్లు కూడా పెండింగ్ లేదని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకున్నా అబద్ధాలు సృష్టించి తెలంగాణ అభివృద్ధి అడ్డుకోవాలని చూస్తోందన్నారు. కేంద్రం ఫెయిల్ అవుతుందని.. కేసీఆర్ పాస్ అవుతున్నందుకు బీజేపీ రాజకీయ పరమైన కుట్ర పన్నిందన్నారు. 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తున్నందుకే కేంద్రానికి ఇతర రాష్ట్రాల నుంచి ప్రశ్నలు ఎదురవు తున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్‌శించారు. ఆ కారణంగానే విద్యుత్ ఎక్స్ఛేంజ్ విషయంలో నిషేధం విధించారని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అందించడం లేదని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయడమే వారి లక్ష్యమని విమర్శించారు.

కాగా, మంత్రి జగదీష్‌ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం దగ్గర సరైన ప్లాన్ లేకపోవడం వల్లే రాష్ట్రంలో కరెంట్ సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శించారు. దేశంలో ఉన్న 13 రాష్ట్రాలకు నిషేధం విధించిందని, కేవలం తెలంగాణకే విధించినట్లు టీఆర్‌ఎస్ నేతలు మాట్లడటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో సింగరేణి దివాళా తీసిందన్నారు. డిస్కంలు అప్పులపాలయ్యాయని దుయ్యబట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..