AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Video: ఉధృతంగా నదీ ప్రవాహం.. ముందున్న కారును నమ్ముకుని వెళ్లిన మరోకారు.. కట్ చేస్తే నిమిషాల్లోనే..

Shocking Video: వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆకస్మిక వరదలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతుంటాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయి.

Shocking Video: ఉధృతంగా నదీ ప్రవాహం.. ముందున్న కారును నమ్ముకుని వెళ్లిన మరోకారు.. కట్ చేస్తే నిమిషాల్లోనే..
Floods
Shiva Prajapati
|

Updated on: Aug 17, 2022 | 5:55 PM

Share

Shocking Video: వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆకస్మిక వరదలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతుంటాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయి. ఈ వరద కారణంగా రోడ్లు, వంతెనలు సైతం కొట్టుకుపోతుంటాయి. ఫలితంగా గ్రామాలకు దార్లు మూసుకుపోతాయి. అయితే, కొన్ని కొన్నిసార్లు రహదారులపై నుంచి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నప్పటికీ.. కొందరు సాహసించి మరీ ఆ వరద నీటిని దాటేందుకు ప్రయత్నిస్తారు. అయితే, అదృష్టం బాగుంటే సేఫ్.. లేదంటే ప్రాణాలు నీటిపాలవడం ఖాయం. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. సెకన్ల వ్యవధిలోనే ఓ కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆ దృశ్యం అందరినీ గగుర్పాటుకు గురిచేస్తోంది. వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ రోడ్డుపై నుంచి భారీ వరద నీరు ప్రవహిస్తుంది. వరద ప్రవాహం బీభత్సంగా ఉంది. ఆ ప్రవాహ ఉధృతిని చూసి బెదిరిపోయిన పలు వాహనదారులు.. తమ వాహనాలను వెనక్కి తిప్పుకుని మరో మార్గంలో బయలుదేరారు. అయితే, ఓ ఫార్చునర్ కారు డ్రైవర్ మాత్రం అలాగే ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దాని వెనక మరో కారు కూడా ఉంది. ఫార్చునర్ కారుకి, మరో కారికి తాడు బిగించి వరద ఉధృతిని దాటించే ప్రయత్నం చేశారు. అయితే, ఆ ప్రయత్నం కాస్తా విఫలమైంది. మధ్యలోనే తాడు తెగిపోవడంతో.. వెనకాల ఉన్న కారు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. సెకన్ల వ్యవధిలోనే ఆ కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. అయితే, కారు రోడ్డు దాటుతుండగా పలువురు వీడియో చిత్రీకరించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియోపై నెటిజన్లు రకరాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో సాహసం చేయడం సరికాదని, ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by MAŠHALLA? (@7ama._.hd)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..