Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఈ ఐదుగురి నిద్రను అస్సలు డిస్ట్రబ్ చేయొద్దు.. ప్రాణాలే పోయే ఛాన్స్..!

Chanakya Niti: ఆచార్య చాణక్యుడి విధానాలు ప్రతీ ఒక్కరి జీవితానికి మార్గదర్శకాలు. మంచి, సురక్షితమైన జీవితాన్ని గడపడానికి చాణక్యుడు నీతి శాస్త్రంలో అనేక ముఖ్యమైన..

Chanakya Niti: ఈ ఐదుగురి నిద్రను అస్సలు డిస్ట్రబ్ చేయొద్దు.. ప్రాణాలే పోయే ఛాన్స్..!
Chanakya Niti
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 15, 2022 | 8:23 PM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడి విధానాలు ప్రతీ ఒక్కరి జీవితానికి మార్గదర్శకాలు. మంచి, సురక్షితమైన జీవితాన్ని గడపడానికి చాణక్యుడు నీతి శాస్త్రంలో అనేక ముఖ్యమైన విషయాలను పేర్కొన్నారు. మంచి, చెడు మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. అయితే, మనుషుల్లో ఒకరికి మరొకరు భిన్నంగా ఉంటారు. ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కోలా ఉంటుంది. వ్యక్తుల నిద్ర గురించి కూడా చాణక్యుడు తన నీతిశాస్త్రం గ్రంధంలో పేర్కొన్నారు. ఐదు గురకాల వ్యక్తులు ఉంటారని, వారిని నిద్ర లేపకూడదని చాణక్యుడు తెలిపారు. అలాంటి వారి నిద్రకు భంగం కలిగించడం వలన ఇబ్బంది పడతారని, ఒక్కోసందర్భంలో జీవితానికే ప్రమాదకరం అని చెప్పారు.

రాజు.. చాణక్యుడు ప్రకారం.. పురాతన కాలంలో రాజును నిద్ర లేపడం పెద్ద సాహసమే. అంతేకాదు నేరంగా కూడా పరిగణించేవారు. ఇక ప్రస్తుత కాలంలోకి వస్తే.. పై అధికారి, పాలకుడిని నిద్రలేపితే వారి కోపానికి గురికావడం తప్పదు.

మూర్ఖుడు.. ఆచార్య చాణక్యుడు ప్రకారం.. మూర్ఖుడిని నిద్ర మేల్కొలపడం అంటే ఇబ్బందులను ఆహ్వానించడమే. మూర్ఖుడు ఎవరి మాటా వినడు. అలాంటి వారిని నిద్ర లేపితే.. హానీ తలపెట్టే ప్రమాదం ఉంది.

శిశువు.. పిల్లలు అసంపూర్ణమైన నిద్రలో మేల్కొంటే చిరాకు పడతారు. దాంతో వారు రచ్చ రచ్చ చేస్తారు. వారిని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకే పిల్లలను నిద్ర మధ్యలో లేపకూడదు. అది వారి ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది.

సింహం.. నిద్రపోతున్న సింహాన్ని లేపడం అంత ప్రమాదకరం మరోటి ఉండదు. ఇలాంటి తప్పును ఎవరూ చేయొద్దు. నిద్రిస్తున్న సింహాన్ని లేపితే.. అది మిమ్మల్ని భక్షిస్తుంది. ప్రాణాలే పోతాయి.

మదమెక్కి జంతువు.. ప్రమాదకరమైన, మదమెక్కిన జంతువు నిద్రిస్తున్నప్పుడు మేల్కొలపడానికి, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించవద్దు. ఇది కోపంతో దాడి చేస్తే ప్రణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. అపరిచిత కుక్కను నిద్ర లేపడం కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..