ఆపిల్స్ ఎక్కువగా ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా?
Samatha
15 march 2026
ఆపిల్స్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా ఆపిల్ పండ్లు తింటారు.
ఆపిల్స్
అయితే ఆపిల్స్ గ్రీన్ కలర్,ఇలా ఇతర రంగుల్లో ఉంటాయి. కానీ మార్కెట్‌లో మాత్రం ఎక్కువగా ఎరుపు రంగులో ఉండే ఆపిల్స్‌కు మాత్రమే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
ఆపిల్స్ రంగులు
మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆపిల్స్ ఎక్కువగా ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? దీనికి గల కారణం ఏంటో? ఇప్పుడు దీని గురించే తెలుసుకుందాం.
ఆపిల్స్ ఎరుపు రంగు
ఆపిల్స్ ఎరుపు రంగులో ఉంటేనే చాలా మందికి ఇష్టం. అయితే వీటికి ఆ రంగు రావడానికి ముఖ్య కారణం ఆంథోసియానిన్లు.
ఆంథోసియానిన్లు
పండు తోలులోని నిర్ధిష్ట జన్యువుల వ్యక్తీకరణ, స్థాయిని బట్టి ఆపిల్‌కు ఎరుపు రంగు వస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
జన్యువుల వ్యక్తీకరణ
ఎంజైములు జంతలు కలిసి పని చేస్తూ, యాపిల్ తోలులోని, నిర్ధిష్ట కణాలను ఆంథోసియానిన్లు అని పిలిచే పిగ్మెంట్లుగా మారుస్తాయంట. దీంతో వాటికి ఎరుపు రంగు వస్తుందంట.
ఎంజైమ్‌ల జత
ఆపిల్స్ పండే సమయంలో సూర్య రశ్మి, ఉష్ణోగ్రత ప్రభావంతో ఈ ఎరుపు రంగు అనేది వస్తుంటుందంట.
సూర్య రశ్మి
ఒక వేళ పండు పండే సమయంలో సూర్యరశ్మి ఎక్కువగా తగిలితే, ఆంథోసైనిన్‌లు ఎక్కువగా పేరుకపోయి, ముదురు ఎరుపు రంగును ఇస్తాయని చెబుతున్నారు నిపుణులు.