Vastu Tips: స్టడీ టేబుల్‌‌పై ఈ 5 వస్తువులు అస్సలు పెట్టొద్దు.. వెంటనే తీసేయండి.. లేదంటే నష్టమే..!

Vastu Tips: వాస్తు శాస్త్రంలో ఇంట్లోని ప్రతి గదికి సంబంధించిన నియమాలు ప్రస్తావించడం జరిగింది. ఇంటి వాస్తు సరిగ్గా ఉంటే ఫలితాలు సానుకూలంగా ఉంటాయి.

Vastu Tips: స్టడీ టేబుల్‌‌పై ఈ 5 వస్తువులు అస్సలు పెట్టొద్దు.. వెంటనే తీసేయండి.. లేదంటే నష్టమే..!
Study Table
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 15, 2022 | 7:52 PM

Vastu Tips: వాస్తు శాస్త్రంలో ఇంట్లోని ప్రతి గదికి సంబంధించిన నియమాలు ప్రస్తావించడం జరిగింది. ఇంటి వాస్తు సరిగ్గా ఉంటే ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. అయితే, తెలియక చేసే కొన్ని తప్పులు కారణంగా తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని కారణంగా ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. ఆ కారణాలు కాస్తా కుటుంబ సభ్యుల విజయానికి అడ్డంకిగా మారుతాయి. పిల్లల చదువు పురోగతికి ఆటంకం కలిగించే కొన్ని విషయాలు గ్రంధాలలో వివరించడం జరిగింది. స్టడీ టేబుల్‌పై ఏమేం ఉండకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

వ్యర్థాలు.. స్టడీ టేబుల్‌పై పాత డైరీ, వేస్ట్ పేపర్, న్యూస్ పేపర్ జంక్ ఉంచడం అశుభం. ఈ వస్తువులను ఉపయోగించకపోతే, వెంటనే వాటిని తొలగించాలి. వాస్తు ప్రకారం ఇవి చదువులో ఆటంకాలు సృష్టిస్తాయి.

శిల్పం.. చాలా మంది తమ స్టడీ టేబుల్‌పై పురాతన విగ్రహాలు సహా ఇతర విగ్రహాలను పెడుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. అవి ప్రతికూలతను కలిగిస్తాయి. దీని కారణంగా పిల్లలు చదువుపై ఏకాగ్రత చూపలేరు. అలాంటి విగ్రహాలు విజయపథంలో అడ్డుపడతాయి.

మొక్క.. ప్రిక్లీ ప్లాంట్‌ను ఎప్పుడూ స్టడీ, ఆఫీసు టేబుల్‌పై ఉంచకూడదు. అది కృత్రిమమైనా కాకపోయినా. ఇటువంటి మొక్కలు పిల్లల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. వారి సృజనాత్మకతను అంతం చేస్తాయి.

శుభ్రపరచాలి.. స్టడీ టేబుల్‌పై దుమ్ము ఉంటే రోజూ శుభ్రం చేయాలి. అలాగే, విరిగిన బొమ్మలు, గదిలో విరిగిపోయిన గడియారాలు ఉంచకూడదు. ఇది ప్రతికూలతను వ్యాపింపజేస్తుంది.

మురికి పాత్రలు.. వాస్తుశాస్త్రం ప్రకారం.. చదువుకునే టేబుల్‌పై ఎప్పుడూ ఆహారం తినకూడదు. ఏదైనా కారణం చేత అక్కడ తినాల్సి వస్తే.. వెంటనే ఆ పాత్రను అక్కడి నుంచి తీసేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లల దృష్టి చదువుపై నుంచి ఇతరాల వైపు మల్లుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..