Relationship: తండ్రీకొడుకు మరిచిపోయి కూడా ఇలా చేయకూడదు.. లేదంటే భారీ నష్టం తప్పదు..!
Relationship: ఒక ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలిసి కష్టపడి పని చేస్తారు. అయినప్పటికీ వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు రావు. అనుకున్న విజయం దక్కదు.
Relationship: ఒక ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలిసి కష్టపడి పని చేస్తారు. అయినప్పటికీ వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు రావు. అనుకున్న విజయం దక్కదు. అలాంటి సందర్భంలో రక్తసంబంధానికి సంబంధించి కొన్ని నివారణలు పాటించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దీనిని అవలంభించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు, పనిలో విజయం సాధించాలనే ఆశ పెరుగుతుంది. కుటుంబం విజయం సాధించాలంటే ఏం చేయాలి? జ్యోతిష్య గ్రంధాలు, మత గ్రంధాలు ఏం చెబుతున్నాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
తండ్రీకొడుకులు ఇలా చేయొద్దు.. ఏదైనా శుభకార్యానికి ఇంటి నుండి బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు.. తండ్రీకొడులు ఇద్దరూ ఒకేసారి ఇంటి నుంచి బయటకు రావొద్దు. అలా రావడం వారికి అశుభం. చేపట్టే పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. ఏ పని చేసిన సక్సెస్ కాదు. అంతేకాదు, తండ్రీకొడుకులు ఒకేసారి ఇంటి నుంచి బయటకు రావడం వల్ల ఒక్కోసారి సామాజిక ప్రతిష్టను కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతాయి. ఆర్థిక సమస్యలూ తలెత్తుతాయి. చేపట్టిన పని సక్సెస్ అవ్వాలంటే.. ఇద్దరిలో ఒకరు ముందుగా వెళ్లాలి. ఆ తరువాత మరొకరు వెళ్లాలి.
ఇద్దరు సోదరులు.. ఇద్దరు సోదరులు కూడా ఒకేసారి ఇంట్లో నుంచి బటయకు రావొద్దు. ఇలా వస్తే ఇంటికి అశుభం. కుటుంబ ప్రతిష్ట దెబ్బతింటుంది. వ్యాపారంలో విజయం సాధించలేరు. ఏదైనా ప్రత్యేక పని కోసం వెళ్తున్నట్లయితే.. ఆ పనిని పూర్త చేయలేరు. ఇద్దరు సోదరు తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే మాత్రం.. వారిలో ఎవరైనా ఒకరు ముందుగా బయటకు రావాలి. ఆ తరువాత మరొకరు వెళ్లాలి. అలా కాకుండా.. ఇద్దరూ కలిసి ఒకేసారి తలుపు తీసి బయటకు వెళితే అనర్థాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.
గమనిక: దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. కేవలం ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని, ఆస్ట్రాలజీలో పేర్కొన్న అంశాలను ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..