Sun Transit 2022: ఆగష్టు 17న సింహరాశిలో సూర్యుడు ప్రవేశం.. ఈ 4 రాశులకు అదృష్టం.. మిగిలినవారికి కష్టాలు..మీరున్నారా తెలుసుకోండి

సూర్యుని మార్పు కొన్ని రాశుల వారికి శుభాలను తీసుకొస్తుంది.. మరికొన్ని రాశులకు కష్టాలను కలుగజేస్తుంది.  ఈ నేపథ్యంలో ఈరోజు రాశులకు కలిగే శుభాశుభాలను గురించి తెలుసుకుందాం.. 

Sun Transit 2022: ఆగష్టు 17న సింహరాశిలో సూర్యుడు ప్రవేశం.. ఈ 4 రాశులకు అదృష్టం.. మిగిలినవారికి కష్టాలు..మీరున్నారా తెలుసుకోండి
Sun Transit 2022
Follow us
Surya Kala

|

Updated on: Aug 15, 2022 | 6:12 PM

Sun Transit 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు తొమ్మిది గ్రహాలకు అధిపతి. సూర్యుడు చంద్రుని రాశి అయిన కర్కాటకరాశిని ఉదయం 07:14 గంటలకు విడిచిపెట్టి, ఆగష్టు 17, 2022న తన స్వంత రాశి సింహరాశి లోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని జ్యోతిష్య శాస్త్రంలో సంక్రాంతి అంటారు . జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు ఆరోగ్యం, అదృష్టం, విజయానికి కారకంగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో సూర్యుని మార్పు కొన్ని రాశుల వారికి శుభాలను తీసుకొస్తుంది.. మరికొన్ని రాశులకు కష్టాలను కలుగజేస్తుంది.  ఈ నేపథ్యంలో ఈరోజు రాశులకు కలిగే శుభాశుభాలను గురించి తెలుసుకుందాం..

మేషరాశి సింహరాశిలో సూర్యుని సంచారం మేషరాశి వ్యక్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పనులకు ఆటంకం కలిగిస్తుంది. కనుక ఈ రాశివారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా తమ పనులను చేయవలసి ఉంటుంది.ముఖ్యంగా డబ్బు లావాదేవీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికీ డబ్బు ఇవ్వకుండా ఉండండి. పరిహారం: ప్రతిరోజూ సూర్య భగవానుడికి అర్ఘ్యమివ్వండి. 

వృషభం:  సింహరాశిలో సూర్యుడు అడుగు పెట్టడం వలన ఈ ప్రభావం వృషభ రాశి వ్యక్తుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కనుక ఈ సమయంలో ఈ రాశివారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈ సమయంలో కొన్ని వ్యాధుల బారిన పడవచ్చు. కుటుంబంలో శాంతి,  సంతోషం ఉండాలంటే వివాదాలకు దూరంగా ఉండండి. పరిహారం: సూర్య భగవానుని పూజించండి , ప్రతిరోజూ సూర్యచాలీసాను పఠించండి.

ఇవి కూడా చదవండి

మిధునరాశి సింహరాశిలో సూర్యుడు సంచరించడం వల్ల ఈ రాశివారికి ఆగిన పనులు పూర్తవుతాయి. జీవితానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. శారీరక బాధలు దూరమవుతాయి. అంతేకాదు పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. పరిహారం: ఆదివారం నాడు బెల్లం, గోధుమలు దానం చేయండి.

కర్కాటక రాశి: సూర్యుని రాశి మార్పు ప్రభావం మీ కుటుంబంపై కనిపిస్తుంది. కుటుంబంలో ఏదో ఒక విషయంలో గొడవలు ఏర్పడవచ్చు. డబ్బుకి  ఇబ్బందులు పడతారు. ఈ రాశివారిని మానసిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. ముఖ్యంగా కళ్ళు, కడుపుకి సంబంధించిన వ్యాధుల బారిన పడవచ్చు. పరిహారం: సూర్య భగవానుని పూజించండి.  ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి.

సింహ రాశి: సింహరాశిలో సూర్యుని సంచారం ఈ రాశివారికి మానసిక ఒత్తిడిని పెంచుతుంది. కుటుంబానికి సంబంధించిన సమస్యల వలన మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమయంలో కోపం ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా కూడా ఇబ్బందులను ఎదుర్కొనే  అవకాశం ఉంటుంది.

కన్య రాశి: సూర్యుడు రాశి మారడం వల్ల కన్య రాశి వారికి ధన నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. కంటి సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి.  కన్య రాశి వారు తమ మాటను, ప్రవర్తనను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పరిహారం: సూర్య భగవానుని పూజించండి. ఎరుపు రంగు వస్తువులను దానం చేయండి.

తుల రాశి: సూర్యుని రాశి మారడం వల్ల తులారాశి వారికి శుభయోగం కలుగుతాయి. అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. డబ్బులు అందుతాయి, పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఈ సమయంలో జీవితానికి సంబంధించిన కష్టాలు తగ్గుతాయి. ఉద్యోగాలలో పెద్ద మార్పు ఏర్పడే అవకాశం ఉంది. పరిహారం: ప్రతిరోజూ సూర్య నారాయణ మంత్రాలను జపించండి.

వృశ్చికరాశి: సూర్యుని రాశి మార్పు వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా శుభాలను కలిగిస్తుంది. విపరీతమైన లాభాలను పొందుతారు. జీవితానికి సంబంధించిన అతి పెద్ద కష్టం తొలగిపోతుంది. ఊపిరి పీల్చుకుంటారు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు ఆరోగ్యాన్ని సంతరించుకుంటారు. పరిహారం: ప్రతిరోజూ సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి.  

ధనుస్సు రాశి: సింహరాశిలో సూర్యుని సంచారము ధనుస్సు రాశివారి సంబంధాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో, వివాదాలకు వాదనలకు దూరంగా ఉండండి.  సుదీర్ఘ ప్రయాణానికి దూరంగా చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు.  పరిహారం: ప్రతిరోజూ సూర్యుడిని ఆరాధించండి. ఆదివారం నాడు బెల్లం, గోధుమలు, ఎరుపు రంగు బట్టలు దానం చేయండి.

మకరరాశి: సింహరాశిలో సూర్యుని సంచారం మకరరాశి వారికి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది.  కనుక మకర రాశి వారు డబ్బు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అదే సమయంలో ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నందున వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి. పరిహారం: రోజూ సూర్య భగవానుని పూజించండి.

కుంభ రాశి: సూర్యుని రాశి మార్పు కుంభ రాశికి కూడా ప్రతికూలంగా ఉంది. ఈ రాశి వారు జీవితానికి సంబంధించిన అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. మానసిక, శారీరక నొప్పి పెరుగుతుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. పరిహారం: ఆదిత్యపారాణం చేయండి 

మీనరాశి: సింహరాశిలో సూర్యుని సంచారం మీనరాశికి చాలా శుభప్రదంగా ఉంది. ఈ సమయంలో, ఈ రాశికి చెందిన వారి ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే కల నెరవేరుతుంది. ధన లాభం ఉంటుంది. శారీరక బాధలు తొలగిపోతాయి. పరిహారం: సూర్య భగవానుని పూజించండి  ప్రతిరోజూ గాయత్రీ మంత్రాన్ని జపించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం పై ఆధారపడి ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)