- Telugu News Photo Gallery Spiritual photos janmashtami 2022 special: know famous temple of lord shri krishna mandir in India
Krishna Janmashtami: ఈ ఆలయాల్లోని కన్నయ్యను పుట్టిన రోజున దర్శిస్తే.. కోర్కెలు తీరతాయట.. దేశంలో ఎక్కడ ఉన్నాయంటే!
Srikrishnastami 2022: శ్రీ కృష్ణ భగవానుడు ద్వాపర యుగంలో మధుర నగరంలో జన్మించాడు. శ్రీ విష్ణువు దశావతారాల్లో ఎనిమిదవ అవతారంగా భావించే శ్రీకృష్ణుడి జన్మస్థలంతో సహా దేశంలో దేశ విదేశాల్లో అనేక దేవాలయాలు ఉన్నాయి. కన్నయ్య దర్శనం, పూజల వల్ల మనిషికి ఉన్న దుఃఖం, అరిష్టాలు తొలగి సుఖం, సౌభాగ్యం లభిస్తాయని నమ్మకం.
Updated on: Aug 20, 2022 | 1:52 PM

శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినాన్ని జరుపుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని కన్నయ్య అద్భుతమైన, గొప్ప దేవాలయాల గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలో కొలువైన కృష్ణుడి దర్శనంతోనే కోరిన అన్ని కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.

శ్రీకృష్ణుడు ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో ఉన్న జైలులో ద్వాపరయుగంలో జన్మించాడని నమ్మకం. ఆయన జన్మించిన ప్రదేశాన్ని నేడు శ్రీ కృష్ణ జన్మభూమి మధురనే ఒక దేవాలయంగా భావిస్తారు. కన్నయ్య దర్శనం కోసం ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. పవిత్రమైన జన్మాష్టమి నాడు, శ్రీ కృష్ణ భగవానుని భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు చేరుకుంటారు.

బృందావన్‌లో ఉన్నబంకేయ్ బిహారీ జీ దేవాలయం శ్రీ కృష్ణ భగవానుడి ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. శ్రీ కృష్ణ భగవానుడి అందమైన విగ్రహాన్ని చూసేందుకు దేశ, విదేశాల నుండి ప్రతిరోజూ వేలాది మంది ఇక్కడికి చేరుకుంటారు. ఈ ఆలయాన్ని స్వామి హరిదాస్ 1864లో నిర్మించారు.

భారతదేశంలోని పురాతన పూరీలలో ఒకటైన ద్వారకలో ఉన్న శ్రీ కృష్ణ భగవానుడి ధామం ద్వారకాధీశ్ ఆలయం. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు ద్వారకాధీశుని రూపంలో పూజలందుకుంటున్నాడు. ఈ పవిత్ర క్షేత్రానికి కలియుగంలో, శ్రీ కృష్ణ భగవానుడితో అనుబంధం ఉందన్నది ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే.. అన్ని దుఃఖాలు, పాపాల నుండి రక్షణ లభిస్తుందని నమ్మకం.

దేశ రాజధానిలో ఢిల్లీలో ఇస్కాన్ టెంపుల్ గా ఖ్యాతిగాంచిన శ్రీ శ్రీ రాధా పార్థసారథి ఆలయం. శ్రీ కృష్ణ భగవానుడి పవిత్ర క్షేత్రం. ఇక్కడ హరే రామ హరే కృష్ణ మహామంత్ర జపం ఎనిమిది గంటల పాటు కొనసాగుతుంది. అద్భుతమైన వాస్తు శిల్పానికి ఉదాహరణగా నిలుస్తోంది ఈ ఆలయం. ఈ ఆలయంలో రాధాకృష్ణులతో పాటు సీతారామ లక్ష్మణులను దర్శించుకోవచ్చు. ఆలయం లోపల వైదిక సంస్కృతిని ప్రోత్సహించే కళాఖండాలు కూడా కనిపిస్తాయి.

శ్రీకృష్ణునికి సంబంధించిన ఈ పవిత్ర క్షేత్రం గుజరాత్‌లోని సౌరాష్ట్రలో ఉంది. శ్రీకృష్ణుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో వేటగాడి బాణం ఆయన ఎడమ కాలిపై తగిలిన చోటే భాల్కా తీర్థం అని నమ్ముతారు. ఇక్కడే శ్రీకృష్ణుడు నిర్యాణం చెందని భూమిని విడిచిపెట్టి వైకుంఠ ధామానికి వెళ్లాడని నమ్మకం. బాణాన్ని భల్లా అని కూడా పిలుస్తారు కాబట్టి, ఈ పవిత్ర యాత్రను భాల్క తీర్థంగా పిలుస్తారు. కేవలం ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడం ద్వారా సర్వ పాపాల నుండి విముక్తి పొంది, సకల భోగభాగ్యాలను అనుభవించి చివరకు వైకుంఠధామానికి చేరుకుంటాడని నమ్ముతారు.




