- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Niti: If you want to get success in career then keep these things in mind of Chanakya
Chanakya Niti: ఈ నాలుగు విషయాలను పాటిస్తే.. కెరీర్ లో సక్సెస్ మీ సొంతం అంటున్న చాణక్య
ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. ఆచార్య చాణక్యుడు విజయం సాధించడానికి నీతిశాస్త్రంలో అనేక ప్రాథమిక సూత్రాలను చెప్పాడు. వాటిని పాటిస్తే కెరీర్‌లో విజయం సాధించవచ్చు.
Updated on: Aug 16, 2022 | 11:05 AM

అసూయ: కోపంలా అసూయ కూడా మనిషికి అతి పెద్ద శత్రువు అని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అసూయ మనిషిని ముందుకు సాగనివ్వదు. అసూయపడే వ్యక్తి ఎప్పుడూ తనతో పాటు, ఇతరుల విజయానికి కూడా అడ్డుగా ఉంటాడు.

స్త్రీలు, పురుషులు తమ భాగస్వామి అందంగా కనిపించాలని కోరుకుంటారనేది నిజం. అయితే చాలా మంది మహిళలు పురుషుల వ్యక్తిత్వంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఒక వ్యక్తి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే.. అతని గొప్ప గుణమని నిరూపించవచ్చు. స్త్రీలు అత్యాశ లేదా అహంకార ధోరణులను కలిగి ఉన్న పురుషుల నుండి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. మహిళలు నిజాయితీగా, విధేయతతో ఉన్నవారిని ఇష్టపడతారు. అటువంటి వారిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారు.

చెడు చేసే వారు - ఆచార్య చాణక్యుడు ప్రకారం మీ వెనుక చెడు చేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇతరులకు మీ ముందు చెడు చేసే వ్యక్తి .. రేపు మీకు ఖచ్చితంగా చెడు చేస్తాడు.

డేగ తన లక్ష్యాన్ని సాధించడంలో ఎప్పుడూ విఫలం కాదు. ఎవరూ తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించే దిశగా అడుగులు వేయాలి. జాగ్రత్తగా ఆలోచించి సమయం తీసుకుని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ఎల్లప్పుడూ లక్ష్యం చేరుకోవాలి.

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో పక్షులకు ఉండే కొన్ని లక్షణాల గురించి కూడా ప్రస్తావించాడు. ఈ పక్షుల నుంచి మనిషి లక్షణాలను స్వీకరించడం ద్వారా.. ఆ వ్యక్తి జీవితంలో విజయం సాధించగలడు. ఒక వ్యక్తి ఏయే పక్షులలో ఏయే లక్షణాలను అలవర్చుకోవచ్చో తెలుసుకుందాం.




