Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Janmashtami 2022: కృష్ణామి ఏరోజున జరుపుకోవాలి.. కన్నయ్య ఆరాధన సమయం, పూజావిధానం తెలుసుకోండి

శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజున కంసుడి చెరసాలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రం కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. అయితే ఈ ఏడాది రాఖి పండగ తర్వాత కృష్ణాష్టమి పండగను జరుపుకునే విషయంలో కూడా గందరగోళం నెలకొంది.

Krishna Janmashtami 2022: కృష్ణామి ఏరోజున జరుపుకోవాలి.. కన్నయ్య ఆరాధన సమయం, పూజావిధానం తెలుసుకోండి
Sri Krishnastami
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Aug 20, 2022 | 1:49 PM

Krishna Janmashtami 2022: శ్రీ మహా విష్ణువు దుష్ట శిక్ష, శిష్ట రక్షణ కోసం దశావతారాలు ఎత్తినట్లు హిందువుల విశ్వాసం.. శ్రీకృష్ణుడు మహావిష్ణువు ఎనిమిదవ అవతారమని హిందూ ఇతిహాసాలు పేర్కొన్నాయి. శ్రీ కృష్ణుడు పుట్టిన రోజుని కృష్ణ జన్మాష్టమి,  కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. దేవకి వసుదేవు దంపతుల ఎనిమిదవ సంతానం శ్రీకృష్ణుడు. శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజున కంసుడి చెరసాలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రం కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. అయితే ఈ ఏడాది రాఖి పండగ తర్వాత కృష్ణాష్టమి పండగను జరుపుకునే విషయంలో కూడా గందరగోళం నెలకొంది. ఉత్తరాఖండ్ జ్యోతిష్ పరిషత్ అధ్యక్షుడు, మత కర్మ నిపుణుడు పండిట్ రమేష్ సెమ్వాల్ ప్రకారం..  ఈ సంవత్సరం ఆగస్టు 18, 2022, గురువారం అర్ధరాత్రి వ్యాపిని అష్టమి గృహస్థులకు , ఆగష్టు 19, 2022న, శుక్రవారం ఉదయకాలిక అష్టమి (వైష్ణవం) సన్యాసుల కోసమని చెప్పారు.

జన్మాష్టమి గురించి శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే..!  అర్ధరాత్రి వ్యాపిని అష్టమిలో మాత్రమే ఉపవాస పూజలు జరుపుకోవాలని చాలా గ్రంథాలు ధృవీకరించాయి. శ్రీమద్ భాగవతం, శ్రీ విష్ణు పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, భవిష్య పురాణం కూడా అర్ధరాత్రి అష్టమి రోజునే  శ్రీకృష్ణుని జననం అని  ధృవీకరిస్తున్నాయి. వీటి ప్రకారం.. జన్మాష్టమి జరుపుకోవాల్సి ఉంటుంది.  రాత్రి గల తిధిలోనే జన్మాష్టమి వేడుకలను జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఇక్కడ రోహిణి నక్షత్రం ప్రధాన నిర్ణయాత్మక అంశం కాదు. అటువంటి పరిస్థితిలో.. రాత్రి అష్టమిగల తిథిని పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఏడాది శ్రీకృష్ణుని జన్మదినోత్సవం రోజున రోహిణి నక్షత్రం లేకపోవడం గమనార్హం.

శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభ సమయం ఈ సంవత్సరం 18 ఆగస్టు 2022న, గురువారం రాత్రి 09:22 తర్వాత, కృత్తిక నక్షత్రం మేష రాశిలో చంద్రుడు సంచరించనున్నాడు. కనుక అష్టమి తిధి రాత్రి ఉన్న గురువారం రోజున శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉపవాసం ఉండాలని సుచించారు. ఎందుకంటే అష్టమి రాత్రి 09:22 తర్వాత ప్రారంభమవుతుంది. 18 ఆగష్టు 2022 నుంచి . 19 ఆగస్టు 2022 రాత్రి 11:00 వరకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభ యోగం ఈ సంవత్సరం ధృవ , వృద్ధి యోగా కూడా 18 ఆగస్టు 2022 న జరుపుకునే శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు ఏర్పడుతోందని, ఇది మర్నాడు  ఉదయం 08:41 వరకు వృద్ధి యోగంగా ఉంటుందని పండిట్ రమేష్ సెమ్వాల్ చెప్పారు. ఉదయం 08:41  తర్వాత ధ్రువ యోగం ప్రారంభమవుతుంది. ఈ యోగం 19వ తేదీ శుక్రవారం ఆగష్టు 2022 రాత్రి 08:58 వరకు ఉంటుంది. ఈ రెండు యోగాలలో చేసే పనులన్నీ శుభప్రదమైనవి, విజయవంతమైనవి.

గృహస్థులకు పూజా సమయం: 18 ఆగష్టు 2022 రాత్రి 12:02 నుండి 12:40 వరకు

సన్యాసులకు 19 ఆగష్టు 2022 ఉదయం 05:50 గంటలకు

శ్రీ కృష్ణ జన్మాష్టమి పూజా విధానం పవిత్రమైన శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు శ్రీకృష్ణునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార మొదలైన వాటితో స్నానం చేయండి. చివరగా, భగవంతుని విగ్రహానికి మరోసారి స్వచ్ఛమైన గంగాజలంతో స్నానం చేసి, బట్టలు, నగలతో అలంకరించండి. దీని తరువాత, గంధపు తిలకం మొదలైన వాటితో స్వామివారిని తీర్చిదిద్దండి. అనంతరం స్వామివారికి ఇష్టమైన ఆహారపదార్ధాలను నైవేద్యంగా  సమర్పించండి. అయితే తప్పనిసరిగా పూజలో తులసి దళాన్ని కన్నయ్యకు సమర్పించాలి.  శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినాన చేసే పూజలో, శ్రీ కృష్ణ భగవానుడికి తప్పనిసరిగా వేణువు , వైజయంతి మాల సమర్పించాలి. శ్రీకృష్ణుడిని పూర్తి శ్రద్ధాసక్తులతో అచంచలమైన విశ్వాసంతో పూజించండి. చివరగా శ్రీష్ణుడికి ప్రదక్షిణ చేయండి. పవిత్రమైన జన్మాష్టమి నాడు గోవుకు సేవ చేయడం ద్వారా శ్రీకృష్ణుడు ఎంతో సంతోషిస్తాడని భక్తుల విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..