AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Idana Mata: సైన్స్ కు సవాల్.. ఇడాన మాత ఆలయం.. అగ్నితో స్నానం చేసే అమ్మవారు.. దర్శనంతోనే పక్షవాతం నయం..

ఇడాన మాత అగ్నిని స్నానంగా తీసుకుంటుంది. దాదాపు 10 నుంచి 20 అడుగులు  మేర అగ్ని దాని అంతట అదే ఉద్భవించి అమ్మవారు నీరు మాదిరిగా స్నానం చేస్తారట.

Idana Mata: సైన్స్ కు సవాల్.. ఇడాన మాత ఆలయం.. అగ్నితో స్నానం చేసే అమ్మవారు.. దర్శనంతోనే పక్షవాతం నయం..
Idana Mata Temple
Surya Kala
|

Updated on: Aug 14, 2022 | 12:09 PM

Share

Idana Mata Temple: మనదేశం పుణ్యభూమి.. కర్మనే ధర్మంగా ఆచరిస్తూ హిందువులు జీవిస్తారు. అధాత్మికత నెలవు. అనేక ఆలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. భగవంతుడే స్వయంగా వెలసిన ఆలయాలు కొన్ని, దేవతలచే ప్రతిష్ఠ చేయబడినవి,  మహర్షులు, తపస్సుచేసి సిద్ధి పొందిన స్వాములు ప్రతిష్ఠించినవి, పురాణాల ద్వారా ప్రసిద్ధిగాంచినవి, రాజుల చేత, భక్తుతో నిర్మించబడినవి ఇలా అనేక దేవాలయాలు ఉన్నాయి. అయితే వీటిల్లో నేటికీ సైన్స్ కు సవాల్ విసురుతూనే ఉన్నాయి. అలాంటి మిస్టరీతో హిస్టరీగా మారిన ఆలయం ఒకటి ఇడాన మాతాలయం. ఇక్కడ అమ్మవారు అగ్నితో స్నానం చేస్తారు.. ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకున్నవారి పక్షవాతం తగ్గుతుందని నమ్మకం. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది.. విశిష్టత ఏమిటి.. చరిత్ర ఏమిటో తెలుసుకుందాం..

రాజస్థాన్ లో ఉదయపూర్‌లోని 60 కిలోమీటర్ల దూరంలో గాయత్రి శక్తి పీఠ్ ఆలయంలో ఇడాన మాతగా అమ్మవారు పూజలను అందుకుంటున్నారు. ఈ దేవాలయంలో విచిత్రం ఏమిటంటే.. ఇక్కడ అమ్మవారు అగ్నిస్నానమాచరిస్తారట. మంట దానంతట అదే ఉద్భవించి.. అమ్మవారికి స్నానం చేయిస్తుందట. ఈ విచిత్రమైన అమ్మవారి ఆలయం.. ఆరావళి పర్వతాల్లో  ఉంది. ఆలయం పై కప్పు ఉండదు.. చతురాస్రాకరంలో ఉంది.

ఇడాన ఉదయపుర్ మేవాల్ మహారాణి పేరు మీదుగా ఈ ఆలయం ప్రఖ్యాతిగాంచింది. ఈ ఆలయంలోని దేవత ఇడాన మాత అగ్నిని స్నానంగా తీసుకుంటుంది. దాదాపు 10 నుంచి 20 అడుగులు  మేర అగ్ని దాని అంతట అదే ఉద్భవించి అమ్మవారు నీరు మాదిరిగా స్నానం చేస్తారట. నెలకు రెండు మూడు సార్లు అమ్మవారు ఇలా అగ్నితో స్నానం చేస్తోందని స్తానికులు చెబుతున్నారు. ఇలా స్నానం చేసే సమయంలో.. అమ్మవారి విగ్రహం తప్ప.. ఆలయంలో ఉన్న వస్తువులన్నీ అగ్నికి ఆహుతి అవుతాయి.

ఇవి కూడా చదవండి

ఈ మంటలను దర్శించుకునే భక్తుల కోరికలు తీరతాయని నమ్మకం. అంతేకాదు పక్షవాతం వచ్చిన వారు, మానసిక వికలాంగులు .. రోగం నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం.  అమ్మవారి ఆలయంలో త్రిశూలం కూడా ఫేమస్.. సంతానం లేని మహిళలు.. ఇక్కడ ఉన్న త్రిశూలాన్ని పూజిస్తే.. సంతానం కలుగుతుందని విశ్వాసం. మంటల్లోని ఇడాన అమ్మవారిని దర్శించుకునేందుకు.. భారీ సంఖ్యలో అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుంటారు. అయితే ఈ అగ్ని ఎక్కడ నుంచి ఎలా ఉద్భవిస్తుందనే విషయంపై ఇప్పటికే రకరకాల పరిశోధనలు చేశారు..  అయితే ఇప్పటి వరకూ ఎవరూ ఈ మిస్టరీని ఛేదించలేకపోయారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం పై ఆధారపడి ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్