Astro Remedies: అవసరం కోసం ఈ వస్తువులను ఇతరులను తీసుకోకండి.. ఆర్ధిక ఇబ్బందులను తీసుకుని రావచ్చు..

కొన్ని వస్తువులను అప్పుగా తీసుకోవడం మంచిది కాదు. వాటిని అలా అడిగి తీసుకోవడం వలన.. అప్పటికి ఆ సమయంలో పూర్తవుతుంది. కానీ మీ జీవితంలో కష్టాలు పెరుగుతాయి.

Astro Remedies: అవసరం కోసం ఈ వస్తువులను ఇతరులను తీసుకోకండి.. ఆర్ధిక ఇబ్బందులను తీసుకుని రావచ్చు..
Unlucky Things
Surya Kala

|

Jun 30, 2022 | 9:32 AM

Astro Remedies: చాలా సార్లు మనం ఏదైనా రాస్తుంటే అకస్మాత్తుగా మన పెన్ పనిచేయడం ఆగిపోయినప్పుడు. వెంటనే  మన దగ్గర కూర్చున్న వాళ్ల దగ్గర పెన్ను అడుగుతాం. ఒకొక్కసారి అనుకోని విధంగా మన వస్తువులు పాడైపోయినప్పుడు.. అత్యవసరం అయినప్పుడు… వెంటనే ఇతరుల దగ్గర నుంచి వస్తువులను తీసుకుని అవసరాన్ని తీర్చుకుంటాం. అయితే  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ..  కొన్ని వస్తువులను అప్పుగా తీసుకోవడం మంచిది కాదు. వాటిని అలా అడిగి తీసుకోవడం వలన.. అప్పటికి ఆ సమయంలో పూర్తవుతుంది. కానీ మీ జీవితంలో కష్టాలు పెరుగుతాయి. అప్పు తీసుకుని వస్తువులు తీసుకుని మీరు ఉపయోగించుకోవడం..  దురదృష్టానికి  కారణం కారణం అవచ్చు. ఈరోజు అప్పుగా తీసుకో కూడని కొన్ని వస్తువుల గురించి తెలుసుకుందాం..

పాదరక్షలు ఈ రోజుల్లో మ్యాచింగ్ దుస్తులను బట్టి పాదరక్షలు ధరించే ట్రెండ్ ఉంది. చాలా సార్లు మనం మన స్నేహితుని, సోదరి, సోదరుడు లేదా ఎవరికైనా తెలిసిన వారి పాదరక్షలను తీసుకుని డ్రెస్‌లకు మ్యాచింగ్ కు అనుగుణంగా ధరిస్తాము. అయితే  ఇలా అస్సలు చేయకూడదు. ఇలా చెప్పులు అప్పుగా తీసుకుని వేసుకోవడం వలనా ప్రతికూల శక్తిని  పొందుతారు. పురాణ గ్రంథాల్లో శని స్థానమును పాదములలో పేర్కొనబడినది. అలాంటి పరిస్థితుల్లో ఇతరుల కష్టాలను మనమే తీసుకుంటాం. అంతేకాదు ఇతరుల బూట్లు లేదా చెప్పులు కూడా మీ జీవితాన్ని పేదరికం వైపు నెట్టడానికి ఒక కారణం కావచ్చు.

ఉంగరం:  చాలా సార్లు మనం ఇతరుల ఉంగరాన్ని అడిగి తీసుకుని ధరిస్తాము. రింగ్ ఏదైనా సరే.. బంగారం లేదా.. రోల్డ్ గోల్డ్.. ఏదైనా సరే.. అది మీ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీంతో ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. మీరు కష్టాలను ఎదుర్కోవలసి రావచ్చు. అంతే కాకుండా, మన ఆరోగ్యం, జీవితం ఉంగరం స్థానానికి సంబంధించినవి. అందుకే ఎవరి ఉంగరాన్ని అప్పుగా తీసుకుని ఎప్పుడూ ధరించవద్దు.

పెన్ రాసేటప్పుడు మీ పెన్ ఆగిపోతే.. వేరే పద్ధతిని అవలంబించండి. కానీ ఇతరుల నుండి అప్పు అడిగి.. ఆ పని పూర్తి  చేయకండి. ఇతరుల పెన్నును ఉపయోగించడం మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి, ఎవరి దగ్గరా పెన్ను అడగవద్దు లేదా మీరు ఉపయోగించిన పెన్ను ఎవరికీ ఇవ్వకండి.

బట్టలు బట్టలు ఎక్కువగా మార్పిడి చేసుకునే వస్తువు. కానీ ప్రతి వ్యక్తికి తన స్వంత శక్తి ఉంటుంది.. అటువంటి పరిస్థితిలో, వేరొకరి బట్టలు ధరించడం ద్వారా..  మీరు అతని శక్తిని మీ స్వంత శక్తితో  కలుస్తుంది. ఇది మీ అదృష్టాన్ని ప్రభావితం చేస్తుంది. అంతేకాదు ఇతరుల బట్టలు కూడా మిమ్మల్ని స్కిన్ ఇన్ఫెక్షన్ లేదా అలర్జీకి గురి చేస్తాయి. అందువల్ల, అవసరమైతే, వేడి నీటితో ఉతికిన బట్టలు ధరించండి. సర్వసాధారణంగా ఇతరుల దుస్తులను ధరించకుండా ఉండడానికి ప్రయత్నించండి.

చేతి వాచ్:  గడియారం మీ అదృష్టానికి సంబంధించింది. కనుక వేరొకరి గడియారం అడగడం అంటే మీరు అతని అదృష్టాన్ని అడుగుతున్నారని అర్థం. ఎదురుగా ఉన్న వ్యక్తి  అదృష్టం చెడుగా మారితే, దాని ప్రభావం మీపై కూడా పడవచ్చు.  అందుకే ఒకరి గడియారాన్ని అడిగి ఎప్పుడూ ధరించవద్దు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం పై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu