Sea Shells Puja: ఇంట్లో సుఖ శాంతుల కోసం పసుపు గవ్వలతో లక్ష్మీదేవిని ఇలా పూజించండి..
గవ్వలను ఆవులను, ఇంటి అలంకరణకె కాదు.. అనేక ఇతర వస్తువుల తయారీకి కూడా ఉపయోగిస్తారు. ఈరోజు గవ్వలతో ఏ విధమైన నివారణా చర్యలు పాటించవచ్చునో తెలుసుకుందాం..
Sea Shells Puja: లక్ష్మీదేవిని పూజించే సమయంలో చాలా వస్తువులను ఉపయోగిస్తారు. ఇందులో గవ్వలు కూడా ఒకటి. గవ్వలు, లక్ష్మిదేవి సముద్రం నుండి జన్మించారని నమ్ముతారు. తంత్ర శాస్త్రంలో.. గవ్వలను లక్ష్మీ దేవితో అనుసంధానించడం కనిపిస్తుంది. గవ్వలు డబ్బును ఆకర్షిస్తాయి. కనుక గవ్వలతో అనేక రకాల నివారణలు కూడా చేయవచ్చు. ఈ చర్యలు తీసుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో సుఖ శాంతి ఉంటుంది. ఈ గవ్వలను ఆవులను, ఇంటి అలంకరణకె కాదు.. అనేక ఇతర వస్తువుల తయారీకి కూడా ఉపయోగిస్తారు. ఈరోజు గవ్వలతో ఏ విధమైన నివారణా చర్యలు పాటించవచ్చునో తెలుసుకుందాం..
పసుపు గవ్వలు
శనివారం రోజున లక్ష్మీ దేవి చిత్రపటం ముందు పసుపు రంగు గవ్వలను ఉంచండి. సాయంత్రం సమయంలో పూజించండి. అనంతరం ఈ గవ్వలను రెండు వేర్వేరు భాగాలుగా విభజించి.. టిని వివిధ ఎరుపు క్లాత్ లో కట్టండి. దీనిలో ఒకటి మీ బీరులో ఉంచండి. మరొకటి మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ఉద్యోగంలో పురోగతి కోసం:
ఉద్యోగంలో విజయం, వ్యాపారంలో పురోగతి కోసం కూడా గవ్వలతో చిన్న చిన్న చర్యలు చేపట్టవచ్చు. ఆలయంలో 11 గవ్వలను సమర్పించండి. ఒక ఎర్రటి క్లాత్ లో 7 గవ్వలను కట్టి, ఇంటర్వ్యూ సమయంలో వాటిని మీతో తీసుకెళ్లండి. ఇది విజయానికి దారి తీస్తుంది.
కొత్త ఇల్లు కట్టేటప్పుడు పునాదిలో 21 గవ్వలను వేయండి. దీంతో ఇంట్లో శాంతి, సంతోషాలు నెలకొంటాయి. మీరు వ్యాపారంలో లాభం పొందాలనుకుంటే, మీ బీరువాలో 7 గవ్వలను ఉంచండి. ఉదయం,సాయంత్రం వాటిని పూజించండి. ఇది వ్యాపారంలో పురోగతిని తెస్తుంది.
11 గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టి ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయండి. ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. సానుకూలతని తెలుస్తుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది.
చెడు దృష్టిని నివారించడానికి.. మెడలో పసుపు రంగు గవ్వను లాకెట్ గా ధరించండి. ఇది చెడు దృష్టిని తొలగిస్తుంది.
శ్రావణ మాసం రానున్నది.. ఈ మాసంలో పసుపు రంగులో ఉన్న 11 గవ్వలను పసుపు బట్టలో కట్టి.. ఎవరికీ కనిపించని విధంగా ఉత్తరం వైపు ఉంచండి. ఇది కుబేరునికి సంతోషాన్నిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
శుక్రవారం పసుపు కలిపిన నీటిలో కొన్ని తెల్లని గవ్వలను నానబెట్టండి. అనంతరం వాటిని ఎరుపు రంగు బట్టలో కట్టాలి. ఇప్పుడు దీనిని సేఫ్ గా ఉంచండి. ఇలా చేయడం వలన ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం పై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)