Horoscope Today: వీరికి అనవసర ఖర్చులు.. కలహ సూచన.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (27-06-2022): చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో చూసుకుంటారు. వారి రాశి ఫలాలను బట్టి ఆరోజు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.

Horoscope Today: వీరికి అనవసర ఖర్చులు.. కలహ సూచన.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope
Basha Shek

|

Jun 28, 2022 | 5:57 AM

Horoscope Today (27-06-2022): చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో చూసుకుంటారు. వారి రాశి ఫలాలను బట్టి ఆరోజు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మంచిముహూర్తాలు చూసుకుని ఏ పనులు చేపడితే ఎలాంటి లాభాలు ఉంటాయి. రోజులో ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై దృష్టి సారిస్తుంటారు. మరి జూన్‌ 27 (సోమవారం)న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేషం

మనోధైర్యం తోడుగా ఉంటుంది. అనుకున్న కార్యాలు సాధిస్తారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితులను కలుస్తారు. ఆరోగ్యం పై శ్రద్ధ వహించడం మంచిది. ఇష్టదైవారాధనతో మంచి ఫలితాలు అందుకుంటారు.

వృషభం

ఈ రాశివారికి ధనలాభం ఉంది. ఒక శుభవార్త మనసుకు అమితానందాన్ని కలిగిస్తుంది. కుటుంబీకులు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక లాభాలున్నాయి. విష్ణు సహస్రనామాలు పఠిస్తే మేలు కలుగుతుంది.

మిథునం

వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆచితూచి అడుగేయాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. దుర్గాదేవిని పూజిస్తే శభం కలుగుతుంది.

కర్కాటకం

వీరు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలలో పెద్దలు, కుటుంబీకుల సహకారం బాగా లాభిస్తుంది. వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది.

సింహం

మంచి మనస్సుతో చేసే పనులన్నీ సఫలమవుతాయి. విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబీకులు, బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలుంటాయి. గొడవలు పెట్టుకునే వ్యక్తులకు దూరంగా ఉండాలి. శివారాధన మేలు చేకూరుస్తుంది.

కన్య

ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. అప్పుడే విజయాలను సొంతం చేసుకుంటారు. తరుచూ నిర్ణయాలు మార్చుకోవద్దు. కీలక విషయాల్లో పెద్దల సలహాలు పాటించడం మంచిది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. ఆంజనేయ స్వామిని పూజిస్తే శుభప్రదం.

తుల

ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పైఅధికారులు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కలహాలు ఏర్పడుతాయి. శని శ్లోకం పఠిస్తే సానుకూల ఫలితాలు పొందుతారు.

వృశ్చికం

వీరికి గ్రహబలం బాగుంది. చేపట్టిన పనులు చాలా సులువుగా పూర్తవుతాయి. ఒక ముఖ్య వ్యవహరంలో ఆర్థిక సాయం అందుతుంది. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. ఇష్టదైవారాధన మాత్రం మరవకూడదు.

ధనస్సు

శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులు, బంధువలు నుంచి ఒక కీలక వ్యవహారంలో సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. అవసరానికి తగిన సహకారం అందుతుంది. ఒక శుభవార్త ఆత్మవిశ్వసాన్ని, మనోధైర్యాన్ని పెంచుతుంది.

మకరం

చేపట్టే పనుల్లో శ్రమాధిక్యం ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. కీలక వ్యవహారాలు పూర్తవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మనోధైర్యం కోసం దుర్గా దేవిని పూజిస్తే మంచిది.

కుంభం

కీలక వ్యవహరాల్లో చంచల స్వభావం పనికి రాదు. ఆర్థిక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సూచనలు తీసుకోండి. అప్పుడే ఆర్థిక లాభం పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో మార్పులుటాయి. సంకటహర గణపతి స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

మీనం

చేపట్టిన పనులపై శ్రద్ధ వహిస్తే విజయం తప్పక వరిస్తుంది. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. కొన్ని సంఘటనలు నిరుత్సాహం కలిగిస్తాయి. అభివృద్ధికి ఆటంకం కలిగించే విషయాలకు దూరంగా ఉండాలి. దుర్గాదేవిని ఆరాధిస్తే మేలు కలుగుతుంది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu