AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరాశుల వారికి మానసిక ఆందోళన తగ్గుతుంది.. రుణ బాధలుండవు.. ఆదివారం రాశిఫలాలు..

ఈరోజు వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది.. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు.

Horoscope Today: ఈరాశుల వారికి మానసిక ఆందోళన తగ్గుతుంది.. రుణ బాధలుండవు.. ఆదివారం రాశిఫలాలు..
Horoscope Today
Rajitha Chanti
|

Updated on: Jun 26, 2022 | 6:51 AM

Share

మేష రాశి… ఈరోజు మీడియా రంగాల వారికి..కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి.. కుటుంబంలో విభేదాలు తగ్గుతాయి.. బంధుమిత్రులను కలుసుకుంటారు.. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది..

వృషభ రాశి.. ఈరోజు వీరి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. ఆకస్మిక ధననష్టం ఏర్పడుతుంది.. అవకాశాలు చేజారిపోతుంటాయి.. కుటుంబంలో మార్పులు సంభవిస్తాయి.

మిథున రాశి.. ఈరోజు వీరు వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.. బంధుమిత్రులతో విభేధాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.. వృత్తి, ఉద్యోగరంగాల్లో సహనం వహించక తప్పదు.. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు..

కర్కాటక రాశి.. వీరు ఈరోజు కుటుంబ విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపించరు.. చేపట్టిన పనులను ఆలస్యంగా పూర్తిచేస్తారు. ముఖ్యమైన కార్యాలను వాయిదా వేస్తారు. స్త్రీలతో జాగ్రత్తగా వ్యహరించాలి. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి.

సింహ రాశి.. వీరికి ఈరోజు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన పెరుగుతుంది. ప్రతి పని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది.. సంఘంలో కీర్తి, ప్రతిష్టలు తగ్గుతాయి. విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది..

కన్య రాశి.. ఈరోజు వీరికి మానసిక ఆందోళన తొలగుతుంది.. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం..చేపట్టిన పనులను వాయిదా వేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు.

తుల రాశి.. ఈరోజు వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది…నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి ప్రయత్నిస్తారు.. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రబాధలు ఉండవు..

వృశ్చిక రాశి.. ఈరోజు వీరికి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. స్థాన చలన సూచనలు ఉంటాయి.. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. గృహంలో మార్పులు జరుగుతాయి. ఆర్థఇక ఇబ్బందులు తగ్గుతాయి.

ధనుస్సు రాశి.. ఈరోజు వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సంతోషంగా కుటుంబంతో గడుపుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. సంఘంలో పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. రుణ బాధలు తొలగుతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

మకర రాశి.. ఈరోజు వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది.. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు.. కళాత్మక వస్తువులు సేకరిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. కొత్త పనులను ప్రారంభిస్తారు.

కుంభ రాశి.. ఈరోజు వీరు ముఖ్యమైన పనులను వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బందిపడుతారు.. పిల్లల పట్ల జాగ్రత్త అవసరం. అవకాశాలను కోల్పోతారు.. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు..

మీన రాశి.. ఈరోజు వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది.. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకుంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు తగ్గుతాయి.