Puri Rath Yatra: జగన్నాథ రథయాత్రలో పాల్గొంటే.. 100యాగాలకు సమానమైన ఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం.. ఆసక్తికర సమాచారం మీ కోసం

Jagannath Rath Yatra: ప్రతి సంవత్సరం జగన్నాథుని రథయాత్ర ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం రెండవ రోజున జరుగుతుంది. ఈ యాత్రలో పాల్గొంటేనే 100 యాగాలకు సమానమైన పుణ్యం లభిస్తుంది. రథయాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారాన్ని తెలుసుకుందాం

Puri Rath Yatra: జగన్నాథ రథయాత్రలో పాల్గొంటే.. 100యాగాలకు సమానమైన ఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం.. ఆసక్తికర సమాచారం మీ కోసం
Jagannath Rath Yatra 2022
Follow us
Surya Kala

|

Updated on: Jun 29, 2022 | 7:21 AM

Jagannath Rath Yatra 2022: ఒడిశా రాష్ట్రంలోని పూరీ నగరంలో జగన్నాథుని భారీ ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది.  ఇది భారతదేశంలోని నాలుగు ప్రధాన ధాములలో ఒకటిగా పరిగణించబడుతుంది. జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం రెండవ రోజున ప్రారంభమవుతుంది. రథయాత్ర సమయంలో.. శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర మూడు వేర్వేరు భారీ రథాలపై ఎక్కి తన నివాసం నుండి గుండిచా ఆలయానికి వెళ్తారు. ఈ రథాలలో మధ్య రథంలో సోదరి సుభద్ర ..  పక్కనే ఉన్న రథంలో శ్రీ కృష్ణుడు, బలరామ విగ్రహాలను ఏర్పాటు చేస్తారు.  జగన్నాథుని ఈ రథయాత్రలో పాల్గొనేందుకు జగన్నాధుడి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈ రథయాత్ర లో పాల్గొన్న వారికి 100 యాగాలకు సమానమైన ప్రతిఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. రథయాత్రలో పాల్గొన్న  వ్యక్తులు మరణానంతరం మోక్షాన్ని పొందుతారని భక్తుల నమ్మకం. ఈసారి జగన్నాథుని రథయాత్ర జూలై 1న జరగనుంది. ఈ సందర్భంగా ఈ యాత్రకు సంబంధించిన అన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం..

జగన్నాథ యాత్రకు సంబంధించిన ఆసక్తికర సమాచారం జగన్నాథుని ఆలయం 800 సంవత్సరాలకు పైగా పురాతనమైనది . ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు తన సోదరి సుభద్ర, సోదరుడు బలరామునితో కలిసి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ఇక్కడ శ్రీ కృష్ణుడు జగన్నాథుడుగా పూజలను అందుకుంటున్నాడు.

ప్రతి సంవత్సరం రథయాత్రకు 15 రోజుల ముందు..  జగన్నాథుడు అనారోగ్యంతో 15 రోజుల పాటు ఉంటాడని పురాణాల కథనం. అనారోగ్య సమయంలో జగన్నాథుడు ఏకాంతంలో ఉంటాడు. పూర్తిగా కోలుకున్న తరువాత భగవంతుడు భక్తులకు దర్శనం ఇస్తాడు. రథయాత్రగా స్వామివారిని తీసుకువెళతారు.

ఇవి కూడా చదవండి

ఈ రథయాత్రలో మూడు రథాలు ఉంటాయి. అన్నింటికంటే ముందున్న రథంలో బలరాముడు మధ్యలో సుభద్రాదేవి రథం.. జగన్నాథుడు రథంలో భక్తులకు దర్శనమిస్తారు. బలరాం రథాన్ని ‘తాళధ్వజ’ అని, సుభద్రా దేవి రథాన్ని ‘దర్పదలన్’ లేదా ‘పద్మ రథం’ అని, జగన్నాథుడి రథాన్ని ‘నందిఘోజ’ లేదా ‘గరుద్ధధ్వజ’ అని అంటారు.

ఈ రథాలన్నీ రంగుల ఆధారంగా గుర్తించబడతాయి . తాళధ్వాజ్ రంగు ఎరుపు, ఆకుపచ్చ. దర్పదలన నలుపు, ఎరుపు లేదా నీలం, ఎరుపు రంగులలో ఉంటుంది . నందిఘోషు రథం రంగు ఎరుపు, పసుపు. నందిఘోష రథం అత్యంత ఎత్తైనది. దీని ఎత్తు 45.6 అడుగులు.. బలరాముడు రథం తలధ్వజ రథం 45 అడుగుల ఎత్తు, సుభద్ర దేవి దర్పదలన రథం 44.6 అడుగుల ఎత్తు.

అక్షయ తృతీయ రోజు నుంచి ఈ రథయాత్రకు సన్నాహాలు ప్రారంభిస్తారు . అన్ని రథాలు స్వచ్ఛమైన, పరిపక్వమైన వేప చెక్కతో తయారు చేస్తారు. దీనిని ‘దారు’ అని పిలుస్తారు. ఈ రథాల నిర్మాణంలో మేకులు లేదా ముళ్ళు లేదా మరే ఇతర లోహాన్ని ఉపయోగించరు.

ఈ రథయాత్ర ఆషాఢ మాసం శుక్ల పక్షం రెండవ రోజు డోలు, సన్నాయి శంఖంతో ప్రారంభమవుతుంది. ఈ ప్రయాణంలో భగవంతుడు గుండిచా ఆలయం వద్ద ఉన్న తన మేనఅత్త ఇంటికి వస్తాడని నమ్ముతారు. అక్కడ ముక్కోటి దేవతలు 7 రోజులు విశ్రాంతి తీసుకుని పదవ రోజున ప్రధాన ఆలయానికి చేరుకుంటారు.

జగన్నాథుడు రథయాత్రలో రథాన్ని లాగడం వల్ల మనిషి పాపాలు నశించి 100 జన్మల పుణ్యం, మోక్షం లభిస్తాయని నమ్మకం. రథాన్ని లాగిన వారిని అదృష్టవంతులుగా పరిగణిస్తారు. ఈ యాత్రలో పాల్గొనడానికి దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం పై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

బంగాళ దుంప రసంతో అందాన్ని పెంచుకోండిలా..!
బంగాళ దుంప రసంతో అందాన్ని పెంచుకోండిలా..!
జియో దిమ్మదిరిగే ఆఫర్‌.. కేవలం రూ.601తో ఏడాది పాటు 5జీ నెట్‌!
జియో దిమ్మదిరిగే ఆఫర్‌.. కేవలం రూ.601తో ఏడాది పాటు 5జీ నెట్‌!
జై మహారాష్ట్ర! అభివృద్ధి గెలిచింది.. ప్రధాని మోదీ సంచలన ట్వీట్
జై మహారాష్ట్ర! అభివృద్ధి గెలిచింది.. ప్రధాని మోదీ సంచలన ట్వీట్
ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు మధుమేహం వస్తుందని హెచ్చరిక
ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు మధుమేహం వస్తుందని హెచ్చరిక
బాలయ్య- బన్నీ అన్ స్టాపబుల్ ఎపిసోడ్‌కు రికార్డు బ్రేకింగ్ వ్యూస్
బాలయ్య- బన్నీ అన్ స్టాపబుల్ ఎపిసోడ్‌కు రికార్డు బ్రేకింగ్ వ్యూస్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
చింతపండు రసం తరచూ తీసుకుంటే శరీరంలో ఏమౌతుందో తెలుసా..?
చింతపండు రసం తరచూ తీసుకుంటే శరీరంలో ఏమౌతుందో తెలుసా..?
పెళ్లి ఊరేగింపులో తప్పిన ప్రమాదం వరుడు దిగిన వెంటనే దగ్ధమైన బండి
పెళ్లి ఊరేగింపులో తప్పిన ప్రమాదం వరుడు దిగిన వెంటనే దగ్ధమైన బండి
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
రుణ దరఖాస్తు పదే పదే తిరస్కరణకు గురవుతుందా? కారణం ఏంటో తెలుసా?
రుణ దరఖాస్తు పదే పదే తిరస్కరణకు గురవుతుందా? కారణం ఏంటో తెలుసా?
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన
ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన
ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా
ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా