Horoscope Today: వీరికి ధన వ్యయం.. బంధువులతో విభేదాలు.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today (29-06-2022): తమ భవిష్యత్ ఎలా ఉంటోందో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇందుకోసం ఎక్కువ మంది రాశిఫలాలను ఆశ్రయిస్తారు. అంతెందుకు చాలా మంది ఉదయం లేవగానే..
Horoscope Today (29-06-2022): తమ భవిష్యత్ ఎలా ఉంటోందో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇందుకోసం ఎక్కువ మంది రాశిఫలాలను ఆశ్రయిస్తారు. అంతెందుకు చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో చూసుకుంటారు. వారి రాశి ఫలాలను బట్టి ఆరోజు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మంచిముహూర్తాలు చూసుకుని ఏ పనులు చేపడితే ఎలాంటి లాభాలు ఉంటాయి. రోజులో ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై దృష్టి సారిస్తుంటారు. మరి జూన్ 29 (బుధవారం )న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.
మేషం
సమయస్ఫూర్తితో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. సమాజంలో మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. లక్ష్మీదేవిని ఆరాధిస్తే శుభం కలుగుతుంది.
వృషభం
తలపెట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. కొందరి ప్రవర్తన మనసుకు బాధ కలిగిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు తలెత్తుతాయి. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మంచిది.
మిథునం
కీలక వ్యవహారాల్లో పెద్దలతో కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే సానుకూల ఫలితాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇష్టదేవతలను పూజిస్తే మేలు చేకూరుతుంది.
కర్కాటకం
కీలక వ్యవహారాల్లో బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త ఆత్మవిశ్వాసం, మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో కీర్తి, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. దైవారాధన మాత్రం మానొద్దు.
సింహం
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో సానుకూల ఫలితాలు అందుకుంటారు. తెలివితేటలతో సమయస్ఫూ్ర్తిగా వ్యవహరిస్తారు. కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేస్తే మరిన్ని మంచి ఫలితాలు అందుకుంటారు.
కన్య
చేపట్టిన రంగాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటాయి. సన్నిహితుల వల్ల మేలు చేకూరుతుంది. కీలక విషయాల్లో మనస్సు చెప్పిన మాటకే విలువ ఇవ్వండి. అప్పుడే సత్ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం మంచిది.
తుల
చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యం. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. రామరక్షా స్తోత్రం చదవడం వల్ల ఇబ్బందులు తొలగిపోతాయి.
వృశ్చికం
పనుల్లో జాప్యం జరుగుతుంది. కుటుంబ బాధ్యతలు నెత్తిన పడతాయి. సమస్యలను ధీటుగా ఎదుర్కోవాల్సి వస్తుంది. కీలక విషయాల్లో అంచనాలు తప్పుతాయి. విలువైన వస్తువుల విషయాల్లో అజాగ్రత్త పనికి రాదు. సూర్య భగవానుడిని ఆరాధిస్తే మంచి కలుగుతుంది.
ధనస్సు
భవిష్యత్ ప్రణాళికలను చక్కగా అమలు చేస్తారు. ప్రియమైన వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనుల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారం ఉంటుంది. ఆంజనేయ స్వామి దర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది.
మకరం
వీరికి అదృష్టం వెన్నంటే ఉంటుంది. అధికారులు కూడా మీకు అనుకూలమైన నిర్ణయాలను తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మేలు చేకూరుతుంది.
కుంభం
అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. మనఃసౌఖ్యం ఉంటుంది. ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. శత్రువులపై పై చేయి సాధిస్తారు. ఇష్టదైవారాధన వల్ల అనుకూల ఫలితాలు పొందుతారు.
మీనం
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదరువతాయి. స్థిరత్వం లేని ఆలోచనల వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. కీలక విషయాల్లో పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం శుభప్రదం.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి