Amarnath Yatra 2022: ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర.. 5వేల మంది యాత్రికులతో తొలి బ్యాచ్..
Amarnath Yatra 2022: అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. 5వేల మంది యాత్రికులతో కూడిన తొలి బ్యాచ్ పహల్గావ్, బల్తాల్ బేస్ క్యాంపులకు..
Amarnath Yatra 2022: అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. 5వేల మంది యాత్రికులతో కూడిన తొలి బ్యాచ్ పహల్గావ్, బల్తాల్ బేస్ క్యాంపులకు బయలుదేరింది. యాత్రికులంతా 176 వాహనాల్లో బయలుదేరారు. కొద్దిసేపట్టి క్రితం బేస్ క్యాంపుల నుంచి అమర్‌నాథ్ వైపు ప్రయాణం మొదలుపెట్టారు.
కాగా, ఈ సారి అమర్ నాథ్ యాత్ర 43 రోజుల పాటు కొనసాగనుంది. జూన్ 30 నుంచి మొదలై ఆగస్టు 11న రక్షా బంధన్ రోజున ముగుస్తుంది. పహల్ గామ్ బేస్ క్యాంపు నుంచి వెళ్లేవారు దక్షిణ కశ్మీర్ లోని నున్వాన్ దారి మీదుగా 48 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది.
బల్తాల్ బేస్ క్యాంపు నుంచి వెళ్లేవారు సెంట్రల్ కశ్మీర్ లోని గండర్బల్ మీదుగా 14 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్ర కోసం పకడ్బందీ ఏర్పాటు చేశారు. ఐదు వేల మందికిపైగా భద్రతా సిబ్బందిని మోహరించారు.
చివరి సారిగా అమర్‌నాథ్ యాత్ర 2019 జూలై 1 నుంచి ఆగస్టు 1వరకు జరిగింది. మొత్తం రూ. 3.42 లక్షల మంది మంచు లింగాన్ని దర్శించుకున్నారు. తర్వాత కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లు ఈ యాత్రను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఈసారి యాత్ర కోసం డిమాండ్ పెరిగింది.