AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bonalu Festival: నేడు బోనమెత్తనున్న భాగ్యనగరం.. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి మొదటి బోనం సమర్పించనున్న భక్తులు

ఆషాఢం రాగానే హైదరాబాద్ మహానగరం ఆధ్యాత్మిక వనంగా మారుతుంది. ఆషాడ బోనాల కోసం గోల్కొండ కోట ముస్తాబైంది. నేడు జగదాంబికా అమ్మవారికి మొదటి బోనం సమర్పించనున్నారు. బోనాల ఊరేగింపు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో బోనాలు ఉత్సవాలు ఆరంభం కానున్నాయి.

Bonalu Festival: నేడు బోనమెత్తనున్న భాగ్యనగరం.. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి  మొదటి బోనం సమర్పించనున్న భక్తులు
Ashadam Golconda Bonalu
Surya Kala
| Edited By: Anil kumar poka|

Updated on: Jul 09, 2022 | 5:29 PM

Share

Bonalu Festival: చారిత్రక నగరంలో ఆధ్యాత్మిక సంబురాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆషాడ బోనాల కోసం గోల్కొండ కోట(Golconda Fort) ముస్తాబైంది. అధికారుల పర్యవేక్షణలో పనులన్నీ పూర్తి అయ్యాయి. నేడు గోల్కొండ జగదాంబికా అమ్మవారికి  మొదటి బోనం సమర్పించనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. అడుగడుగున సీసీ కెమెరాల పర్యవేక్షణలో గోల్కొండ బోనాలను నిర్వహించనున్నారు.  జీహెచ్ఎంసీ, ఆర్కిటెక్ డిపార్ట్ మెంట్ సమన్వయంతో భద్రతను ఏర్పాటు చేశారు. 2వేల మంది పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

ఆషాఢం రాగానే హైదరాబాద్ మహానగరం ఆధ్యాత్మిక వనంగా మారుతుంది. బోనాల ఊరేగింపు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో బోనాలు ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. గల్లిగల్లిల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఆషాఢ బోనాలు గోల్కొండ కోట ఎల్లమ్మ జగదాంబిక ఆలయంలో గురువారం ప్రారంభం కానున్నాయి. లంగర్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై నుంచి ఈ వేడుకలను ప్రారంభిస్తారు.

బోనాల కోసం గోల్కొండ కోటకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. జలమండలి ఆధ్వర్యంలో అమ్మవారి టెంపుల్ వరకు మంచినీటి సరఫరా ఏర్పాటు చేశారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా భక్తుల తాకిడి కొంచెం తగ్గింది కానీ ఈ సంవత్సరం మాత్రం ఘనంగా జరగబోతుందని ప్రధాన అర్చకులు ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..