Love Story: ప్రేమ అంటే అంతేమరి.. వయసుతో పని ఏముంది.. 61ఏళ్ల వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న 18 ఏళ్ల యువతి.. మా ఆయన బెస్ట్ అంటూ కితాబు

ఈ ప్రేమ గురించి తెలిస్తే.. ఎవరైనా ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు వయస్సుని గురించి పట్టించుకోరు అని అంటారు. తాజాగా ఓ యువతి.. వృద్ధుడి ప్రేమ వెలుగులోకి వచ్చింది. ఇద్దరి మధ్య ప్రేమ గురించి తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు.

Love Story: ప్రేమ అంటే అంతేమరి.. వయసుతో పని ఏముంది.. 61ఏళ్ల వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న 18 ఏళ్ల యువతి.. మా ఆయన బెస్ట్ అంటూ కితాబు
Alia Shamshad
Follow us
Surya Kala

|

Updated on: Jun 30, 2022 | 7:14 AM

Love Story: ప్రేమ గుడ్డిది అనే సామెత అందరికి తెలిసిందే. నిజమైన ప్రేమ.. ఆస్తులు అంతస్తులు, కులం, మతం ఇవేమీ చూడదని అంటారు. అయితే నేటి యువత ప్రేమకు సరికొత్త అర్ధాన్ని ఇస్తుంది. నిర్వచనం మార్చేసింది.. ప్రేమ అంధత్వంతో పాటు, ప్రేమ మూగది, చెవిటిది అని కూడా అనాల్సి వస్తుంది.. కొంతమంది ప్రేమ గురించి వింటుంటే.. తాజాగా ఓ ప్రేమ గురించి ప్రత్యేకమైన కథలు తెరపైకి వచ్చింది. ఈ ప్రేమ గురించి తెలిస్తే.. ఎవరైనా ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు  వయస్సుని గురించి పట్టించుకోరు అని అంటారు. తాజాగా ఓ యువతి.. వృద్ధుడి ప్రేమ వెలుగులోకి వచ్చింది. ఇద్దరి మధ్య ప్రేమ గురించి తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు.

పాకిస్థాన్‌లోని రావల్పిండిలో 18 ఏళ్ల ఆషియా 61 ఏళ్ల రానా శంషాద్ తో ప్రేమలో పడింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వీరి  ప్రేమకథ చర్చనీయాంశంగా మారగా, వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైందనే  ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ తమ మధ్య ప్రేమ ఎలా మొదలైంది అన్న ప్రశ్నకు సమాధానమిచ్చింది ఆషియా.

తన ప్రేమకథ గురించి ఆషియా మాట్లాడుతూ.. అతనికి ఉన్న ఒక అలవాటు నా దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది. నేను అతనితో ప్రేమలో పడ్డాను. నిజానికి రానా శంషాద్  చాలా పేదరికంలో ఉన్న అమ్మాయిలకు పెళ్లి చేయడానికి మా ప్రాంతానికి వచ్చేవాడు. దీంతో తమ ప్రాంతంలోని ప్రతి ఒక్కరూ శంషాద్ గురించి అతని మంచి తనం గురించి మాట్లాడుకునేవారు.. నాకు అప్పుడు అతనిపై ఆసక్తి కలిగింది. రెండు సార్లు శంషాద్ ను కలిశాను.. తర్వాత  శంషాద్‌ను తాను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. పెళ్లి తర్వాత శంషాద్ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు.. నేను ఏది కావాలని కోరుకున్నా వెంటనే తెచ్చి ఇచ్చేస్తారు.

ఇవి కూడా చదవండి

శంషాద్ తన భార్య ఆషియా గురించి మాట్లాడుతూ.. జంటలను దేవుడు నిర్ణయిస్తాడు.. ఇక్కడ హృదయాలు మాత్రమే కలుస్తాయి.  దంపతులు ఒకరితో ఒకరు ముడిపడి జీవిస్తుంటారు. అయితే మా వయస్సు వ్యత్యాసం వలన ప్రజలు చాలా అసౌకర్యానికి గురవుతున్నారని శంషాద్ చెప్పారు. అంతే కాకుండా ఆషియాతో నేను పెళ్లికి ఓకే చెప్పినప్పుడు.. ఇది విని చాలా మంది బంధువులు నన్ను నోటికి వచ్చినట్లు మాట్లాడారు. తమ వయసులో ఉన్న తేడా దృష్ట్యా.. తమ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడం.. అడ్డంకులు సృష్టించడం సర్వసాధారణం అని అనుకున్నట్లు చెప్పాడు.

ఈ ఇంటర్వ్యూలో.. ఇప్పటికీ తమ గురించి పెళ్లి గురించి తమ బంధువులు, చుట్టుపక్కల ప్రజలు మాట్లాడుతూనే ఉంటారని చెప్పారు. నేను ఊరులో ఎక్కడ నుంచి,  ప్రాంతంనుంచి వెళ్తున్నా.. ఇప్పటికీ మా వివాహం గురించి ప్రజలు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఒకొక్కసారి ప్రజలు నన్ను అడుగుతారు.. మీరు ఏమి చూసి ఆషియాను పెళ్లి చేసుకున్నారు అని… నేను ఇప్పుడు నా ప్రేమ గురించి అందరికీ వివరించలేను.. అంతేకాదు ఇప్పుడు నేను ఎవరి మాటలను పట్టించుకోనని అన్నాడు శంషాద్.  అయితే, ఈ మొత్తం ఇంటర్వ్యూలో శంషాద్,  ఆషియాలు పెళ్లి ఎప్పుడు జరిగిందో అస్సలు చెప్పలేదు (Source)

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి