Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Expensive Pillow: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు.. బంగారం, వజ్రాలతో తయారీ.. ఖరీదు తెలిస్తే షాక్..

ఈ దిండు వేసుకుంటే సుఖమైన నిద్రపట్టడం మాట ఏమోకానీ.. కొనాలనే ఆలోచనే నిద్రలేకుండా చేస్తుంది.. ఎంత గొప్పవాడు కూడా మంచం మీద ఈ దిండుని పెట్టే ముందు వందసార్లు ఆలోచిస్తాడు. expensive pillow

Expensive Pillow: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు.. బంగారం, వజ్రాలతో తయారీ.. ఖరీదు తెలిస్తే షాక్..
24 Carat Gold Cover Pillow
Follow us
Surya Kala

|

Updated on: Jun 27, 2022 | 8:37 AM

Expensive Pillow: మంచి నిద్రకు దిండు చాలా ముఖ్యం. దిండు సుఖవంతమైన, సౌకర్యవంతమైన నిద్రను అందిస్తుంది. దీంతో మరుసటి రోజు పూర్తిగా తాజాగా ఉంటారు. నిద్రించడానికి మంచి దిండ్లు ఉపయోగించని వ్యక్తులు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. నిద్ర లేకపోవడం వల్ల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. దిండ్లు తయారీ కోసం పూర్వ కాలం నుంచి నేటికీ పత్తిని ఉపయోగిస్తారు. అయితే ఆధునిక యుగంలో వచ్చిన మార్పుల్లో భాగంగా దిండు రూపురేఖలను కూడా  మార్చేసింది. ఈ రోజు మనం అలాంటి ఒక విభిన్నమైన ఖరీదైన దిండు గురించి తెలుసుకుందాం. ఈ దిండు ప్రత్యేకతను తెలుసుకొంటే వావ్ అంటారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు.

నెదర్లాండ్స్‌కు చెందిన ఫిజియోథెరపిస్ట్ ఈ ఖరీదైన దిండును తయారు చేశారు. నిద్రలేమికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులు ఈ దిండుపై ప్రశాంతంగా నిద్రపోతారని దీని సృష్టికర్త పేర్కొన్నారు. ఈ దిండు ధర చాలా ఎక్కువ.. ఎంత ఎక్కువ అంటే.. ఈ దిండుకు బదులుగా మీరు ఓ లగ్జరీ కారును కొనుగోలు చేయవచ్చు. దీంతో ఇంత ఖరీదైన దిండుపై తలపెట్టి పడుకోవడం ఆమ్మో అనుకుంటాం.. ఈ దిండు తయారీకి ఒకటి రెండు కాదు ఏకంగా 15 ఏళ్లు పట్టింది. ఎందుకంటే దీని తయారీ కోసం ఫిజియోథెరపిస్ట్ చాలా పరిశోధనలు చేయాల్సి వచ్చింది.

మీరు ఈ దిండు యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకునే ముందు.. ఈ దిండు ధర గురించి తెలుసుకుందాం.. ధర విన్న తర్వాత మీరు మీ నిద్రను కూడా కోల్పోవచ్చు. నిజానికి ఈ దిండు ధర 57 వేల డాలర్లు.. అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపు 45 లక్షల రూపాయలు. ఈ దిండు నీలమణి, బంగారం, వజ్రంతో తయారు చేస్తారు కనుక అంత ఖరీదైనది.

ఇవి కూడా చదవండి

దిండు లోపల ఉపయోగించే పత్తి రోబోటిక్ మిల్లింగ్ మెషిన్. అంతే కాకుండా ఈ దిండుకి నాలుగు వజ్రాలు అందంగా ఏర్పాటు చేయడమే కాదు.. అదనపు ఆకర్షణగా నీలమణిని కూడా ఏర్పాటు చేశారు. ఈ దిండును బ్రాండెడ్ బాక్స్‌లో ఉంచారు. ఈ దిండు వేసుకుంటే సుఖమైన నిద్రపట్టడం మాట ఏమోకానీ.. కొనాలనే ఆలోచనే నిద్రలేకుండా చేస్తుంది.. ఎంత గొప్పవాడు కూడా మంచం మీద ఈ దిండుని పెట్టే ముందు వందసార్లు ఆలోచిస్తాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..