AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog House: కుక్కల కోసం ప్రత్యేకమైన ఇల్లు.. కోటి రూపాయలపైనే ఖరీదు.. జపాన్‌లో తయారీ

తమ పెంపుడు జంతువులకు తమ ఇంట్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నార. వాటిని అందంగా అలంకరిస్తున్నారు. పుట్టిన రోజు, శ్రీమంతం, పెళ్లిళ్లు వంటి వేడుకలను కూడా ఘనంగా జరుపుతున్నారు. అయితే ఇప్పుడు తమ పెంపుడు జంతువుల కోసం అత్యంత ఖరీదైన ఇళ్లను కూడా తయారు చేయిస్తున్నారు.

Dog House: కుక్కల కోసం ప్రత్యేకమైన ఇల్లు.. కోటి రూపాయలపైనే ఖరీదు.. జపాన్‌లో తయారీ
Amazing Dog House
Surya Kala
|

Updated on: Jun 22, 2022 | 6:27 PM

Share

Dog House: కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులను కుటుంబ సభ్యులు తమ ఫ్యామిలీ సభ్యుల్లా భావిస్తారు. తమ పిల్లలతో సమానంగా ప్రేమగా పెంచుకుంటారు. అయితే జంతు ప్రేమికులు తమ పెంపుడు జంతువులకు తమ ఇంట్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని భావించడమే కాదు.. వాటిని అందంగా అలంకరిస్తున్నారు.. డ్రెస్ వేస్తున్నారు.. ఇక పుట్టిన రోజు, శ్రీమంతం, పెళ్లిళ్లు వంటి వేడుకలను కూడా ఘనంగా జరుపుతున్నారు. అయితే ఇప్పుడు కొంతమంది జంతు  ప్రేమికులు తమ పెంపుడు జంతువుల కోసం అత్యంత ఖరీదైన ఇళ్లను కూడా తయారు చేయిస్తున్నారు. ముఖ్యంగా పెంపుడు కుక్కల కోసం చాలా ఖరీదైన..  ప్రత్యేకంగా రూపొందించిన డాగ్ హౌస్‌లు సిద్ధం చేయబడ్డాయి. అయితే దీని ధర ఎంతో తెలిస్తే బిత్తరపోతారు. ఎందుకంటే ఈ డాగ్ హౌస్ ఖరీదు సామాన్యుడు మాత్రమే కాదు.. ఓ మోస్తరు ఆర్ధిక స్థితి ఉన్నవారు కూడా ఊహించలేనంత.. ఇప్పటి వరకూ కుక్కల కోసం ఇంటిని చూసి ఉండవచ్చు.. కానీ ఇప్పుడు జపాన్ లో రెడీ చేసిన డాగ్ హౌస్ మాత్రం వెరీ వెరీ స్పెషల్.. దీని ధర కూడా కోట్ల రూపాయిలు.. అవును

కుక్క కోసం సిద్ధం చేసిన డాగ్ హౌస్ విలువ కోటి రూపాయల కంటే ఎక్కువ. ఈ కుక్క ఇల్లు డిజైన్ జపనీస్ ఆలయం లేదా మఠం లాగా ఉంటుంది. ఈ హౌస్ ని రెడీ చేయడానికి నిపుణుల సహాయం తీసుకోబడింది. దీంతో ఇప్పుడు కుక్క కోసం రెడీ చేసిన కళాఖండం కోట్ల విలువ చేస్తుంది. రాయల్ పాలెస్ అంత విలాసవంతమైన ఇల్లుని చూస్తే ఎవరైనా మైమరచిపోతారు.

ఇక్కడ వీడియో చూడండి

ఇవి కూడా చదవండి

ఒసాకాలోని ఒక సంస్థ కుక్కల కోసం ఈ ప్రత్యేక డాగ్ హౌస్‌ని రూపొందించింది. ఈ సంస్థ సాంప్రదాయ భవనాల నుండి మఠాల వరకు అన్నింటిని మరమ్మత్తు చేయడంతో పాటు.. వాటిని పరిరక్షిస్తుంది. తాజాగా ఈ సంస్థ ఇనుడెన్ అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా కంపెనీ కుక్కల కోసం డాగ్ హౌస్‌లను నాణ్యమైన సహజ పదార్థాలతో తయారు చేస్తుంది. దీనికోసం జపాన్ దేవాలయాలు, మఠాలు, కోటలలో ఉపయోగించే సాంకేతికతను ఉపయోగిస్తుంది.

గతంలో మఠాలు , దేవాలయాలను నిర్మించడంలో అనుభవం ఉన్న మెటల్, చెక్క పని నిపుణుల సహాయంతో డాగ్ హౌస్ నిర్మించబడింది. ఫూర్తిగా చేతితో చెక్కి ఈ డాగ్ హౌస్ ని నిర్మించారు. కుక్కల ఇంటి పైకప్పును రాగి ప్లేట్లు, గ్రెనైడ్ బేస్‌తో కప్పారు. సెప్టెంబర్ 1 నుంచి కుక్కల ఇళ్ల నిర్మాణం ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇలా డాగ్ హౌస్ ను తయారు చేయడానికి  1.5 లక్షల డాలర్లను (మన దేశ కరెన్సీలో  1 కోటి 17 లక్షల రూపాయలు) ఛార్జ్ చేస్తోంది సదరు సంస్థ.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..