Agnipath Protest: సికింద్రాబాద్‌ అల్లర్లలో కొత్త ఆధారాలు.. వీడియోల్లో రైళ్లను తగలబెడుతున్న యువకులు.. నేరం రుజువైతే ఉరిశిక్ష లేదా యావజ్జీవ జైలు

దుండగులు రైళ్లలోకి ఎక్కి తగలబెడుతున్న దృశ్యాలు కూడా బయటికొచ్చాయి. ఓ రైలు కోచ్‌లో సీట్లకు పేపర్లను కుక్కి అగ్గిపెట్టెతో అంటించారు. ఈ విజువల్స్‌లో ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారో క్లియర్‌గా తెలుస్తోంది.

Agnipath Protest: సికింద్రాబాద్‌ అల్లర్లలో కొత్త ఆధారాలు.. వీడియోల్లో రైళ్లను తగలబెడుతున్న యువకులు.. నేరం రుజువైతే ఉరిశిక్ష లేదా యావజ్జీవ జైలు
Agnipath Protest
Follow us
Surya Kala

|

Updated on: Jun 22, 2022 | 6:07 PM

Agnipath Protest: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ (Secunderabad Railway Station) అల్లర్ల కేసులో సిట్ బృందం దర్యాప్తు వేగవంతం చేసింది.. విధ్వంసానికి సంబంధించిన కొత్త ఆధారాలు దొరకాయి. రైళ్లకు నిప్పుపెట్టిన కీలక ఎవిడెన్స్ పోలీసులకు చిక్కింది. ఈ కేసులో రైళ్లను తగలబెట్టినవారిని గుర్తించారు పోలీసులు. రైళ్లు ఎలా తగలబెట్టారో కొన్ని వీడియోల్లో బయటపడ్డాయి. అందులో ఓ యువకుడు స్టేషన్‌లో లిఫ్టు, రైలు డోరు, ఏసీ కోచ్‌ విండోలను పగలగొట్టడం కనిపించింది. అంతేకాదు.. ఈ దుండగులు రైళ్లలోకి ఎక్కి తగలబెడుతున్న దృశ్యాలు కూడా బయటికొచ్చాయి. ఓ రైలు కోచ్‌లో సీట్లకు పేపర్లను కుక్కి అగ్గిపెట్టెతో అంటించారు. ఈ విజువల్స్‌లో ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారో క్లియర్‌గా తెలుస్తోంది. ఇద్దరు యువకులను ఇప్పటికే గుర్తించారు. వీరిపై అభియోగాలు రుజువైతే మరణశిక్ష గాని.. యావజ్జీవం కాని పడే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

సికింద్రాబాద్‌ అల్లర్ల కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన రైల్వే పోలీసులు కీలక ఆధారాలను సంపాదించారు. ఈ కేసును సిట్‌కు బదిలీ చేశారు. రిమాండ్‌ రిపోర్ట్‌లో పలు కీలక అంశాలను చేర్చారు. మెడికల్‌ ఫిట్‌నెస్‌ సాధించి ఆర్మీ ఉద్యోగాల కోసం చూస్తున్న 56మందిని నిందితులుగా చేర్చారు. పలు డిఫెన్స్‌ అకాడమీల పాత్ర ఉన్నట్టు గుర్తించారు. మొత్తం 18మందిని ప్రత్యక్ష సాక్షులుగా చేర్చిన పోలీసులు.. A-1 మధుసూధన్‌ను అరెస్ట్‌ చేశారు.. అకాడమీల నిర్వహకులు వాట్సాప్‌ గ్రూపుల్లో అల్లర్లకు ప్లాన్‌ చేసినట్టు గుర్తించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో దాడి ఘటన రిమాండ్‌ రిపోర్టులో పలు కీలక అంశాలను వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..