TS RTC: బాబ్బాబు.. మీ ధరలు పెంచరా ప్లీజ్.. ఆంధ్రా బస్సులకు తెలంగాణా ఆర్టీసీ రిక్వస్ట్! ఎందుకంటే..

కొత్త పథకాలకు శ్రీకారం చుడుతోంది. ఆర్టీసీ సంస్థపై భారం తగ్గే విధంగా ఇటీవల కొంతమేర బస్సు చార్జీలను పెంచింది. అయితే ఈ నిర్ణయం వలన ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి లాభం చేకూర్చినట్లు తాజా లెక్కల ద్వారా తెలుస్తోంది.

TS RTC: బాబ్బాబు.. మీ ధరలు పెంచరా ప్లీజ్.. ఆంధ్రా బస్సులకు  తెలంగాణా ఆర్టీసీ రిక్వస్ట్! ఎందుకంటే..
Ts Rtc Vs, Ap Rtc
Follow us

|

Updated on: Jun 14, 2022 | 9:42 AM

TS RTC: ప్రయాణం చేయడానికి సామాన్యులు, పేద, మధ్యతరగతివారు ఎంచుకునే వాహనం ఆర్టీసీ బస్సు (RTC bus).  పల్లెకు, పట్టణానానికి ప్రజలను సురక్షితంగా చేరవేసే ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం.. అయితే గత కొంతకాలంగా నష్టాల్లో నడుస్తోన్న ఆర్టీసీని మూలిగే నక్కమీద తాటికాయ పడినట్లు.. కరోనా రక్కసి.. మరింత ఇబ్బందుల్లోకి తోసేసింది. ఇక రోజు రోజుకీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్(Petrol, diesel) ధరలు కూడా ఆర్టీసీ నష్టాలకు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. అయితే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని రక్షించుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రజలను ఆకర్షించి.. ఆర్టీసీ బస్సు సదుపాయాన్ని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకుని వెళ్లే విధంగా అనేక ప్రయత్నాలు చేస్తోంది. కొత్త పథకాలకు శ్రీకారం చుడుతోంది. ఆర్టీసీ సంస్థపై భారం తగ్గే విధంగా ఇటీవల కొంతమేర బస్సు చార్జీలను పెంచింది. అయితే ఈ నిర్ణయం వలన ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి లాభం చేకూర్చినట్లు తాజా లెక్కల ద్వారా తెలుస్తోంది.

తెలంగాణ ఆర్టీసీ సర్వీసు చార్జీలు పెరడంతో.. ప్రయాణికులు ఏపీ ఆర్టీసీ బస్సులపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వివిధ ప్రాంతాల బస్సుల్లో ఏపీ బస్సులనే ప్రయాణికులు ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ ఆర్టీసీ ఆదాయం పెరి.. ఇక్కడ తగ్గింది. ముఖ్యంగా గత నాలుగు ఐదు రోజుల్లోనే ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులు ఫుల్ అవుతున్నాయని.. దీంతో అక్కడ ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరినట్టు గణాంకాలు చెబుతున్నాయి

ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ.. ఏపీ-తెలంగాణ మధ్య తిరిగే సర్వీసుల్లో చార్జీలు పెంచాలని ఏపీఎస్‌ ఆర్టీసీని కోరింది. రెండు రాష్ట్రాల రవాణా సంస్థల మధ్య జరిగిన అంతర్‌రాష్ట్ర ఒప్పందం ప్రకారం.. ఇరురాష్ట్రాల మధ్య తిరిగే బస్సుల చార్జీలు ఒకేలా ఉండాలని.. కనుక ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ తన బస్సుల చార్జీలు పెంచాలని కోరింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ