AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Humanity: ఆస్తి కాజేసి అత్తను రోడ్డు పాలు చేసిన కోడలు.. 4 రోజులుగా చెట్ల కింద వృద్ధురాలు

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న థీరీని నేటి మనిషి బాగా అమలు చేస్తున్నాడు.. చివరికి కని పెంచినవారిని సైతం పిల్లలు కనికరించడం లేదు. ఉన్న ఆస్తిని కాజేసి ఓ అత్తను రోడ్డు పాలు చేసింది ఓ కోడలు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా (Nalgonda District) నాంపల్లి మండలం (Nampalli Mandal) వడ్డెపల్లిలో జరిగింది.

Humanity: ఆస్తి కాజేసి అత్తను రోడ్డు పాలు చేసిన కోడలు.. 4 రోజులుగా చెట్ల కింద వృద్ధురాలు
Mother In Law Protest
Surya Kala
|

Updated on: Jun 22, 2022 | 2:37 PM

Share

Humanity: అనుబంధం ఆప్యాతయ అంతా భూటకం.. మనుషులు ఆత్మతృప్తికై ఆడుకునే నాకటం అన్న సినీ కవి మాటలను నేడు నిజం చేస్తున్నారు చాలామంది జనం.. రోజు రోజుకీ మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. రక్తబంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారుతున్నాయి. ఆస్తి పాస్తుల ముందు అనుబంధాలు, ఆత్మీయతల తావు లేకుండాపోయింది. చివరికి కని పెంచినవారిని సైతం పిల్లలు కనికరించడం లేదు. ఉన్న ఆస్తిని కాజేసి ఓ అత్తను రోడ్డు పాలు చేసింది ఓ కోడలు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా (Nalgonda District) నాంపల్లి మండలం (Nampalli Mandal) వడ్డెపల్లిలో జరిగింది.

వడ్డెపల్లికి చెందిన సూదనబోయిన బుగ్గమ్మకు కుమారుడు, కుమార్తె సంతానం. ఈమె భర్త నర్సింహ 30 ఏళ్ల క్రితమే మృతి చెందారు. కుమార్తె వివాహం జరిపించిన అనంతరం అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటి నుంచి బుగ్గమ్మ ఒంటరి మహిళగా బతుకీడుస్తూనే ఉన్న ఒక్కగానొక్క కొడుకు జంగయ్య కోసం కష్టపడి ఏడెకరాల భూమి, ఇంటి స్థలం సంపాదించింది. కొడుకును పెద్దచేసి వివాహం జరిపించింది. కుమారుడి పేరున భూమి ఉండాలని ఒక ఎకరం 20 గంటల భూమి అతని పేరున రిజిస్ట్రేషన్‌ చేసింది. అతడికి ఇద్దరు కుమార్తెలు కాగా మనురాళ్లకు పెళ్లిళ్లు చేసి, వారి పేరున రెండెకరాల చొప్పున భూమి పట్టా చేసింది. ఎనిమిది నెలల క్రితం పశువులు కాసేందుకు వెళ్లిన కుమారుడు ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందాడు. అదే సమయంలో బుగ్గమ్మ ఎడమ కాలుకు ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో ఐదు నెలల క్రితం వైద్యులు ఆమె కాలు తొలగించారు.

కొడుకు మరణానంతరం అతని పేరున ఉన్న భూమిని కోడలు లక్ష్మమ్మ తన పేరున మార్చుకోవాలని నిర్ణయించుకుంది. పట్టా మార్పిడి కోసం సాక్షి సంతకం కావాలంటూ బుగ్గమ్మను తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకెళ్లి కొడుకు భూమితో పాటు తనకు తెలియకుండానే తన పేరు మీద ఉన్న భూమిని ఆమె పేరుపై మార్చుకున్నట్లు బుగ్గమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. అప్పటి నుంచి తనకు తిండి పెట్టకుండా వేధిస్తున్నట్లు ఈ నెల 17న నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది బుగ్గమ్మ. నాలుగు రోజులుగా పోలీస్‌స్టేషన్‌ చెట్ల కింద ఉంటూ.. పండ్లు తింటూ కడుపు నింపుకుంటోంది. పస్తులుండి ఆస్తులు కూడబెట్టిన తనను అనాథను చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. తహసీల్దార్‌కు సమస్యను వివరించి, అక్రమ రిజిస్ట్రేషన్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ