Agnipath Protest: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో ఏ1 గా మధుసూదన్.. క్షమించమని ప్రధాని మోడీని కోరుతున్న తల్లిదండ్రులు

ఆర్మీ అభ్యర్థుల నియామక సమయంలో పోలీస్ ఎంక్వైరీ ఉంటుందని.. అభ్యర్థులు బ్యాక్ గ్రౌండ్ చెకింగ్ ఉంటుందని తేల్చి చెప్పేశారు.. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో A1గా మధు సూదన్ తల్లిదండ్రులు సాయిలు, సవిత స్పందించారు.

Agnipath Protest: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో ఏ1 గా మధుసూదన్.. క్షమించమని ప్రధాని మోడీని కోరుతున్న తల్లిదండ్రులు
Agnipath Protest
Follow us

|

Updated on: Jun 22, 2022 | 4:20 PM

Agnipath Protest: కేంద్ర ప్రభుత్వం ఆర్మీలో నియామకాలను చేపట్టడానికి తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశంలో అనేక రాష్ట్రాలతో పాటు.. సికింద్రాబాద్ వేదికగా ఆందోళనకారులు నిరసనలు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ సంఖ్యలో ఆందోళనకారులు విధ్వసం సృష్టించారు. రంగంలోకి దిగిన సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. అసలు ఈ విధ్వంసానికి కారణం ఎవరో తేల్చేపనిలో బిజీబిజీగా ఉన్నారు. ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీల పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నరసరావుపేట సాయి డిఫెన్స్ అకాడమీ యజమాని ఆవుల సుబ్బారావుని పోలీసులు అరెస్ట్ చేసి.. విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.  మరోవైపు ఈ అల్లర్లలో పాల్గొన్న ఏ ఒక్క యువతని ఆర్మీ రిక్యుట్ మెంట్ సమయంలో పరిగణలోకి తీసుకోమని ఇప్పటికే ఆర్మీ అధికారులు తేల్చి చెప్పారు. నియామక సమయంలో పోలీస్ ఎంక్వైరీ ఉంటుందని.. అభ్యర్థులు బ్యాక్ గ్రౌండ్ చెకింగ్ ఉంటుందని తేల్చి చెప్పేశారు.. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో  A1గా మధు సూదన్ తల్లిదండ్రులు సాయిలు, సవిత స్పందించారు.

Tv9 తో మాట్లాడుతూ.. తమ కొడుకు మధుసూదన్ గత 3 ఏళ్లుగా ఆర్మీ ఉద్యోగం కోసం కష్టపడుతున్నాడని తెలిపారు. సాయి అకాడమీ లో శిక్షణ పొందుతున్నాడు.. సుబ్బారావు కాల్ చేసి రమ్మంటున్నారు అని తమకు చెప్పాడని.. అయితే ఇంత పెద్ద గొడవ జరిగిన విషయం పోలీసులు కాల్ చేసి చెప్పే వరకు తమకు తెలియదని మధుసూదన్ తల్లిదండ్రులు సాయిలు, సవిత తెలిపారు. తమ కొడుకు సుబ్బారావ్ అకాడమీ యాజమాన్యం ఎప్పుడు పిలిచిన వెళ్లే వాడని.. సెలవుల్లో ఇంటికి వస్తే.. మేకలు కాచుకునేవాడని తెలిపారు.

కబడ్డీ లో చాలా ప్రైజ్ లు సాధించాడని.. ఆర్మీ లో ఉద్యోగమే లక్ష్యం అంటూ తమ కొడుకు ఆరోజు వెళ్లాడని తెలిపారు. అయితే ఇలా అవుతుంది అనుకోలేదు.. మా కొడుకుని బలి చేయవద్దు.. మా కొడుకును క్షమించండి నంటూ కన్నీరు పెట్టుకున్నారు. అని ప్రధాని మోడీకి దండం పెట్టి వేడుకుంటున్నామన్నారు మధుసూధన్ తల్లిదండ్రులు సాయిలు, సవిత.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ