Hyderabad: నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మరో ఫ్లైఓవర్ వచ్చేసింది. కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం..
Hyderabad: హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తూ మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. కూకట్‌పల్లి నియోజకవర్గం కైత్లాపూర్‌లో నిర్మించిన ROBని మంగళవారం..
Hyderabad: హైదరాబాద్ మహా నగరంలో ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తూ ప్రభుత్వం ఇప్పటికే పలు ఫ్లైఓవర్‌లను, అండర్ పాస్‌లను నిర్మించిన విషయం తెలిసిందే. వీటితో చాలా వరకు కష్టాలు తీరని, నగరంలో రద్దీగా ఉండే పలు చోట్లు సిగ్నల్ ఫ్రీగా మారాయి. ఇదిలా ఉంటే తాజాగా ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తూ మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది.
కూకట్‌పల్లి నియోజకవర్గం కైత్లాపూర్‌లో నిర్మించిన రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB)ని మంగళవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హైటెక్ సిటీ – బోరబండ రైల్వే స్లేషన్ల మధ్య ఈ ROBని నిర్మించారు. దీని వల్ల హైటెక్‌సిటీ, KPHB, జేఎన్టీయు వైపు ట్రాఫిక్ తగ్గనుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల సికింద్రాబాద్, బాలానగర్, సనత్‌నగర్, కూకట్‌పల్లి వెనుక వైపు హైటెక్‌సిటీ వెళ్లే వారు ఇకవై కైత్లాపూర్ బ్రిడ్జి మీద నుంచి మాదాపూర్ వైపు సులభంగా చేరుకోవచ్చు. ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో మూడున్నర కిలోమీటర్ల మేర దూరం తగ్గడంతో పాటు ట్రాఫిక్ సమస్యకు చెక్ పడుతుంది. ఈ బ్రిడ్జిపై రహదారి మొత్తం పొడవు 675.50 మీటర్లు, వెడల్పు సుమారు 16.6 మీటర్లు. ఇది 5.5 మీటర్ల సర్వీస్ లేన్‌తో నిర్మించారు.
కేంద్రంపై మరోసారి కేటీఆర్ ఫైర్..
కైత్లాపూర్ ఫ్లైఓవర్ ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ చేసిన అభివద్ధిని ప్రస్తావిస్తూనే కేంద్రంపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ, కేంద్ర పెద్దలు హైదరాబాద్‌కు ఎందుకు వస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఏం ఇచ్చారని, ఏం తెస్తున్నారని ఇక్కడి వస్తున్నారని నిలదీశారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టాలని చూసే వారికి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
MA&UD Minister @KTRTRS inaugurated the Road-over-Bridge (RoB) at Kaithalapur in Kukatpally today. The Govt. of Telangana constructed the four-lane, two-way RoB under the Strategic Road Development Program (SRDP) at a cost of Rs. 83 Crores. pic.twitter.com/7bPyhyixLX
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 21, 2022
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..