US Firing: అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం.. డబ్బుల కోసం తెలంగాణ యువకుడు దారుణ హత్య..
మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ సిటీలో ఆదివారం తెల్లవారుజామున సాయి చరణ్ కొంతమంది దుండగులు తుపాకీతో కాల్చి చంపారు.దొంగతనానికి వచ్చిన సాయుధులు దాడికి పాల్పడ్డారు. దుండుగులు దాడిలో సాయి చరణ్ ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా పోలీసు అధికారులు తెలిపారు.
US Firing: అగ్రరాజ్యం అమెరికాలో (America) దారుణం జరిగింది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రంలో విద్యార్థి నల్లజాతీయుల కాల్పుల్లో బలయ్యాడు. నల్గొండ వివేకానంద నగర్‌కు చెందిన 26ఏళ్ల సాయిచరణ్.. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ సిటీలో ఆదివారం తెల్లవారుజామున సాయి చరణ్ కొంతమంది దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఆదివారం సాయంత్రం కారులో వెళ్తుండగా దుండగులు అడ్డగించి అతడిని తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటనలో సాయిచరణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దొంగతనానికి వచ్చిన సాయుధులు దాడికి పాల్పడ్డారు. దుండుగులు దాడిలో సాయి చరణ్ ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా పోలీసు అధికారులు తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు తెలిపారు.
సివిల్ ఇంజనీర్ అయిన సాయిచరణ్ ఈ ఏడాది జనవరి 2 నుంచి మెరిలాండ్ స్టేట్ లోని ఎన్విరాన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అతను హనోవర్‌లో నివసిస్తున్నాడని తెలిసింది. తెల్లవారుజామున తన స్నేహితుడిని డ్రాప్ చేయడానికి విమానాశ్రయానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దారున ఘటన చోటుచేసుకుంది. రిటైర్డ్ టీచర్ నక్క నర్సింహా, పద్మ దంతుల ఒక్కగానొక్క కొడుకు. సాయిచరణ్ నల్లజాతీయుడి చేతిలో మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగి పోయారు. కూతురు హారిక కూడా ఆరేగాన్ రాష్ట్రంలో ఉంటున్నారు.