Teeth Blackening: ఆ దేశంలో పెళ్ళైనా, చావైనా పళ్లకు నల్లరంగు.. వెయ్యేళ్ల క్రితం వింత ఆచారం..

జపాన్ దేశంలో హీయన్ కాలంలో ఈ ప్రత్యేకమైన ఆచారం అమలులో ఉంది. అతి పురాతనమైన ఈ ఆచారాన్ని అప్పట్లో ఒహగురో అని పిలిచేవారు. ఈ ఒహగురో ఆచారాన్ని జపాన్‌తో పాటు, చైనా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి దేశాల్లో కూడా పాటించేవారు.

Teeth Blackening: ఆ దేశంలో పెళ్ళైనా, చావైనా పళ్లకు నల్లరంగు.. వెయ్యేళ్ల క్రితం వింత ఆచారం..
Teeth Blackening
Follow us

|

Updated on: Jun 21, 2022 | 4:31 PM

Teeth blackening: మానవ నాగరికత చరిత్ర కొన్ని వేల సంవత్సరాల నాటిది. రాతియుగం నుండి నేటి వరకు మానవ జాతిలో ధరించే దుస్తులు, తినే ఆహారం. జీవన విధానం ఇలా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో.. వాటికి సంబంధించిన అనేక నమ్మకాలు, సాంప్రదాయాలున్నాయి. ఒకొక్కసారి కొన్ని ప్రాంతాల నమ్మకాలు తెలుసుకుంటే ప్రజలు ఆశ్చర్యపోతారు. ఆధునిక విజ్ఞానం, సాంకేతిక పరంగా ప్రజలు ఎంత ముందుకు దూసుకెళ్తున్నా.. నేటి పురాతన సంప్రదాయ ఆచారాలను పాటించే వారు.. ఉన్నారు. ఈరోజు కొన్ని వందల ఏళ్ల నుంచి పాటిస్తున్న అలాంటి ఒక నమ్మకం గురించి తెలుసుకుందాం.. ఆ దేశంలోని ప్రజలు.. ప్రత్యేకమైన రోజుల్లో దంతాలకు నల్ల రంగును వేసుకుంటారు.  ఈ వింతైన ఆచారం.. జపాన్ లో(Japan) ఉంది. వివరాల్లోకి వెళ్తే..

జపాన్ దేశంలో హీయన్ కాలంలో ఈ ప్రత్యేకమైన ఆచారం అమలులో ఉంది. అతి పురాతనమైన ఈ ఆచారాన్ని అప్పట్లో  ఒహగురో అని పిలిచేవారు. ఈ ఒహగురో ఆచారాన్ని జపాన్‌తో పాటు, చైనా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి దేశాల్లో కూడా పాటించేవారు. ముఖ్యంగా 794వ సంవత్సరం నుండి 1185వ సంవత్సరం వరకు ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఒహగురో సంప్రదాయాన్ని పాటించిన ఆ నాటి యువతీ యువకులు తమ పళ్లు నల్లబడేలా చేసుకునేవారు.. తద్వారా వారు యవ్వనంగా ఉన్నారని ఓ కథనం.

చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం.. ఈ విధానం ఆరోగ్య పరంగా చాలా ఉపయోగకరంగా ఉండేది. ఇలా నల్లరంగు వేసుకోవడం వలన దంతాల మీద సూక్ష్మక్రిములు లేకుండా చేస్తుంది. చిగుళ్ళను రక్షిస్తుంది. నోటికి ఎటువంటి హాని కలిగించదు. ముఖ్యంగా పెళ్లి వయసు వచ్చిన అమ్మాయిలు ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ తెల్ల దంతాలను నల్లగా మార్చుకునేవారు. తద్వారా ఆ యువతి దంతాలు దూరం నుండి చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

పురాతన కాలంలో దంతాలు నల్లబడటం అనేది జ్ఞానం, అందం చిహ్నంగా పరిగణించబడేదని తెలిస్తే షాక్ తింటారు. సామాన్య ప్రజలు మాత్రమే కాదు.. ఆనాటి రాజకుటుంబాల చెందిన వ్యక్తులు కూడా తమ దంతాలకు నల్లటి రంగును వేసుకునేవారు. ముఖ్యంగా వివాహం లేదా అంత్యక్రియల వంటి సందర్భాలలో కూడా ప్రజలు తమ దంతాలను నల్లగా మార్చుకునేవారు. నేటికీ, జపాన్‌లోని గీషా జిల్లా మహిళలు ప్రత్యేక సందర్భాలలో తమ దంతాలను నల్లగా చేసుకుంటారు.

సైనిక సైనికులు తమ నోటిలో ఏదైనా గాయం అయిన సమయంలో లేదా లోపాన్ని దాచడానికి వారి దంతాలను నల్లగా మార్చుకుంటారు. అప్పట్లో పళ్లు నల్లగా మారేందుకు కనెమిజు కనెమిజు అనే పదార్థాన్ని ఉపయోగించేవారు. దీన్ని తయారు చేయడానికి, ఐరన్ ఫిల్లింగ్‌లను వెనిగర్, టీ , రైస్ వైన్‌తో కలుపుతారు. ఐరన్ ఫిల్లింగ్‌లు టీకి లేదా వెనిగర్‌కి జోడించబడ్డాయి. ఆక్సీకరణం చెందినప్పుడు, ద్రవం నల్లగా మారుతుంది. ప్రజలు తమ దంతాలను నేరుగా తెలుపు నుండి నల్లగా మార్చుకోవడం కోసం ఈ ప్రత్యేక పదార్ధాన్ని తయారు చేసుకుని ఉపయోగించేవారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో