Crude Oil Spill: పైప్‌లైన్ దెబ్బతిని.. ఎడారిపాలైన వేల బ్యారెళ్ల చమురు.. ఆయిల్ సంస్థలకు భారీ నష్టం..
ఓ వైపు అంతర్జాతీయంగా చమురు ధరలు పై పైకి ఎగసి పడుతున్నాయి. మరోవైపు లిబియాలోని చమురు కంపెనీలో దారుణం జరిగింది. ఎంతో కష్టపడి తయారు చేసిన వేల బారెళ్ల చమురు ఎడారి పాలైంది..
Crude Oil Spill: మూలిగే నక్కమీద తాటికాయ పడిన చందంగా.. అసలే రోజు రోజుకీ చమురు ధరలు చుక్కలను తాకుతుంటే.. ఇప్పుడు వేల బ్యారెళ్ల చమురు ఎడారి పాలైంది. అవును ఉక్రెయిన్ రష్యాల యుద్ధం కారణంగా ఇప్పటికే చమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఓ వైపు అంతర్జాతీయంగా చమురు ధరలు పై పైకి ఎగసి పడుతున్నాయి. మరోవైపు లిబియాలోని చమురు కంపెనీలో దారుణం జరిగింది. ఎంతో కష్టపడి తయారు చేసిన వేల బారెళ్ల చమురు ఎడారి పాలైంది. సరీర్ చమురు క్షేత్రాన్ని మధ్యధరా సముద్రంలో ఉన్న టోబ్రూక్ టెర్మినల్‌కు కలిపే భూగర్భ పైపులైన్ దెబ్బతింది. దీంతో భారీ ఎత్తున చమురు మట్టిలో కలిసిపోయింది.
ఎర్ర రంగులో ఉండే ఎడారి ప్రాంతం చమురు లీకైన ప్రాంతాల్లో నల్లగా మారిపోయింది. ఇప్పటికే చమురు సంక్షోభంతో అల్లాడుతున్న లిబియాలోని ఆయిల్ సంస్థలు ఈ ఘటనతో తీవ్రంగా నష్టపోనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైపు లీకేజ్ కారణంగా 22వేల బ్యారెళ్ల చమురును నష్టపోయినట్లు పైపులైన్ ను నిర్వహిస్తున్న అరేబియన్ గల్ఫ్ ఆయిల్ కంపెనీ అంచనా వేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..