UN Rights Office: అల్ జజీరా జర్నలిస్టు అబు అక్లా మరణానికి కారణం ఇజ్రాయెల్ ఆర్మీనే.. తేల్చి చెప్పిన ఐక్యరాజ్యసమితి
అబు అక్లా మరణానికి కారణమైన కాల్పులు ఇజ్రాయెల్ భద్రతా దళాల నుండి వచ్చినట్లు తామ పరిశోధనలో తేలిందని UN మానవ హక్కుల కార్యాలయ ప్రతినిధి రవినా శందసాని జెనీవాలో విలేకరులతో చెప్పారు.
UN Rights Office: అల్ జజీరా చానల్ మహిళా జర్నలిస్టు (Al Jazeera journalist) షిరీన్ అబు అక్లాను (Shireen Abu Akleh) ఇజ్రాయెల్ బలగాలే కాల్పులు జరిపి హతమార్చినట్లు ఐక్యరాజ్యసమితి శుక్రవారం వెల్లడించింది. ఈ సంఘటన మే 11న జరిగింది. న్యూస్ కవర్ సమయంలో షిరీన్ తలకు హెల్మెట్ పెట్టుకున్నారు. బులెట్ ప్రూఫ్ జాకెట్ ధరించారు. దానిపై ప్రెస్ అని రాసుంది. వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్ క్యాంపులో ఇజ్రాయెల్ ఆర్మీ ఆపరేషన్‌ను ఆమె కవర్ చేస్తున్నప్పుడు బుల్లెట్లు తగిలాయి. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. అబు అక్లా మరణానికి కారణమైన కాల్పులు ఇజ్రాయెల్ భద్రతా దళాల నుండి వచ్చినట్లు తామ పరిశోధనలో తేలిందని UN మానవ హక్కుల కార్యాలయ ప్రతినిధి రవినా శందసాని జెనీవాలో విలేకరులతో చెప్పారు. అయితే “ఇజ్రాయెల్ అధికారులు ఈ కాల్పులపై నేర విచారణను నిర్వహించకపోవడం ఆందోళనకు గురిచేస్తోందని అన్నారు. అంతేకాదు “యుఎన్ మానవ హక్కుల కార్యాలయంలో తాము ఈ సంఘటనపై స్వతంత్ర విచారణ చేపట్టి.. అది ముగించినట్లు పేర్కొన్నారు.
షిరీన్ అబు అక్లాను మరణించగా.. ఆమె సహోద్యోగి మరో జర్నలిస్టు అలీ సమోదీని గాయపడి చికిత్స పొందారు. తాజాగా అలీ సమోది తమపై జరిగిన కాల్పులపై మాట్లాడుతూ.. తమను గాయపరిచిన బుల్లెట్లు.. ఇజ్రాయెల్ భద్రతా దళాల నుండి వచ్చాయని చెప్పారు. తాము గాయపడడానికి కారణం.. ఇజ్రాయెల్ అధికారులు పేర్కొన్నట్లు.. సాయుధ పాలస్తీనియన్ల విచక్షణారహిత కాల్పుల వలన కాదు.. ” అలీ సమోదీ చెప్పిందని రవినా శందసాని చెప్పారు. ఇజ్రాయెల్ సైన్యం ,పాలస్తీనా అటార్నీ జనరల్ నుండి సమాచారం ఈ కాల్పులపై వచ్చిందని ఆమె తెలిపారు. “జర్నలిస్టుల సమీప పరిసరాల్లో సాయుధ పాలస్తీనియన్ల కార్యకలాపాలు ఉన్నట్లు సూచించే సమాచారం తమకు దొరకలేదు” అని శామ్‌దసాని చెప్పారు.
ఈ కాల్పులకు ఎవరు కారకులో నిర్ధారణకు రావడానికి.. యుఎన్ మానవ హక్కుల కార్యాలయం ఫోటో, వీడియో, ఆడియో మెటీరియల్‌ని తనిఖీ చేసింది. సన్నివేశాన్ని.. పరిశరాలను సందర్శించింది. నిపుణులను సంప్రదించింది. అధికారిక కమ్యూనికేషన్‌లను సమీక్షించింది. అంతేకాదు ప్రత్యక్ష సాక్షులను ఇంటర్వ్యూ చేసింది. ఏడుగురు జర్నలిస్టులు ఉదయం 6:00 గంటల తర్వాత జెనిన్ శరణార్థి శిబిరంలోని పశ్చిమ ద్వారం వద్దకు చేరుకున్నారని కనుగొన్నది.
ఉదయం 6:30 గంటలకు.. నలుగురు జర్నలిస్టులు ఒక వీధిలో న్యూస్ కవర్ చేస్తుండగా.. “ఇజ్రాయెల్ భద్రతా బలగాల వైపు .. బుల్లెట్‌లు వారి వైపుకు దూసుకెళ్లాయి. “ఒక్క బుల్లెట్ అలీ సమోదీ భుజానికి గాయం చేసింది. మరో బుల్లెట్ అషిరీన్ అబు అక్లా తలకు తగిలడంతో ఆమె అక్కడిక్కడే మరణించింది.” షిరీన్ అబు అక్లా హత్యపై నేర విచారణను ప్రారంభించాలని UN మానవ హక్కుల చీఫ్ మిచెల్ బ్యాక్‌లెట్ ఇజ్రాయెల్‌ను కోరారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..